English   

సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ డే కలెక్షన్స్: నెవ్వర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్

Sarileru Nekevvaru 1St Day Collections.jpg
2020-01-12 12:59:40

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా రిలీజయిన తాజా చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య శనివారం విడుదలైంది. ముందుగా ఊహించినట్లుగానే బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. సినిమా విడుదలైన తొలిరోజే బ్లాక్ బస్టర్‌ అని తేల్చేశారు ఆడియన్స్. దర్శకుడు అనిల్ రావిపూడికి ఈ సినిమా వరుసగా ఐదో హిట్ కాగా మహేష్‌కి వరుసగా మూడో హిట్ ఇచ్చింది.

ఇక హీరోయిన్‌గా నటించిన రష్మిక మందనకు భారీ హిట్ దక్కగా పదమూడేళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చిన విజయ శాంతికి సెకండ్ ఇన్నింగ్స్ కోసం సరైన సినిమానే పడింది.  ఇక ఈ సినిమా తొలి రోజు వసూళ్ల విషయంలో తెలుగు రాష్ట్రాల్లో ‘సరిలేరు నీకెవ్వరు’ దుమ్ముదులిపేసింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టా్ల్లో తొలిరోజు సినిమా 35 కోట్ల రూపాయలు రాబట్టినట్లు ట్రేడ్ విశ్లేషకులు అంచనా. వరల్డ్ వైడ్ గా కూడా ఓపెనింగ్ అదిరిపోయిందని అంటున్నారు. ఇక ప్రపంచవ్యాప్తంగా సినిమా 47 కోట్లు రాబట్టినట్టు చెబుతున్నారు. అమెరికాలో అయితే తొలిరోజు ఏకంగా ఆరు కోట్లు రాబట్టిందట.

సినిమా అనుకున్నత విజయం సాధించిన నేపథ్యంలో టీం అంతా కలిసి మహేష్ బాబు ఇంట్లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. ఈ సందర్భంగా దిగిన ఫొటోను అనిల్ రావిపూడి ట్విటర్ వేదికగా పంచుకున్నారు. ‘మీ విజిల్స్‌కి, మీ స్పందనకు, మీ అభిమానానికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నా. సెలబ్రేషన్స్ షురూ’ అని పేర్కొన్నారు.

More Related Stories