English   

భీష్మ టీజర్ టాక్

Bheeshma Teaser
2020-01-12 13:42:55

యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా నటిస్తున్న ‘భీష్మ’ టీజర్ వచ్చేసింది. నిమిషానికి పైగా ఉన్న భీష్మ టీజర్ లో నితిన్ కామెడీ టైమింగ్ ఆదరకోట్టింది. భీష్మ సినిమాని పూర్తి ఫన్ అండ్ రొమాంటిక్ ఎలిమెంట్స్ తో యూత్ ఫుల్ మూవీ గా దర్శకుడు వెంకీ కుడుముల తెరకెక్కించినట్టు అనిపిస్తోంది. ‘నీ పేరేంటి’ అని నితిన్‌ను నటుడు సంపత్ అడిగితే.. ‘భీష్మ’ అంటాడు. అప్పుడు ఆయన ‘భీష్మ కాదు భీష్మ సర్ అనాలి’ అంటాడు. ఇందుకు నితిన్ స్పందిస్తూ.. ‘అంటే నా పేరుకి సర్ యాడ్ చేస్తే బాగోదేమో’ అని వేసిన పంచ్ నవ్వులు పూయిస్తోంది.

ఏం చేస్తుంటావ్ అని అడిగితే.. మీమ్స్ చేస్తుంటానని చెప్తాడు. కానీ రష్మిక అడిగితే మాత్రం ఐఏఎస్, ఏసీపీ అని చెబుతాడు. ‘నా అదృష్టం ఆవగింజంతే ఉంటే దురదృష్టం దబ్బకాయ ఉందండి’ అంటూ నితిన్ బాధపడుతూ చెప్తున్న డైలాగ్ కూడా చాలా కామెడీగా ఉంది.  వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ కామెడీ బాగుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగ వంశీ సినిమాకు నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమా ఫిబ్రవరి 21న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

More Related Stories