English   

పృధ్వీరాజ్ రాసలీలల కేసు...టీటీడీ కీలక ఆదేశాలు

raj
2020-01-12 19:44:28

ఎస్వీబీసీ ఛానెల్ ఛైర్మన్ గా ఉన్న పృధ్వీరాజ్ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్నారు. మొన్నటికి మొన్న రాజధాని రైతులపై చేసిన కామెంట్లతో విమర్శలు ఎదుర్కున్న పృధ్వీ ఇప్పుడు మహిళా ఉద్యోగితో మాట్లాడిన ఆడియో టేపులతో మరింత చిక్కుల్లో పడ్డారు. అయితే తానే తప్పు చేయలేదని, తనపై కొందరు కక్ష గట్టారని అంటున్నారు పృధ్వీ. నిజానికి ముందుగా ఒంగోలులో రాజధాని రైతులపై వైసీపీ నేత, ఎస్వీబీసీ ఛైర్మన్ పృథ్వీరాజ్ చేసిన కామెంట్లు కాకరేపాయి. రైతులను పెయిడ్ ఆర్టిస్టులంటూ అవమానించారని పోసాని విమర్శలతో మొదలన రగడ అధిష్టానం వద్దకు చేరింది. క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతుండగా... తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను రైతులను ఎక్కడా అవమానించలేదన్నారు పృథ్వీ. అలా ఒక్కసారి పొరపాటున నోరు జారిన పృధ్వీ.. ఆ వివాదం నుంచి బయటపడటానికి ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టినా ఇంతవరకూ తేరుకోలేకపోయారు. ఇదిలా ఉండగానే పృధ్వీపైప ఎస్వీబీసీ ఉద్యోగుల సంఘం సంచనల ఆరోపణలు చేసింది. మహిళా ఉద్యోగితో పృధ్వీ ఫోన్ సంభాషణ బయటపెట్టింది. పృధ్వీరాజ్ ను ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి నుంచి తప్పించాలని తిరుపతిలో ఆందోళన జరిగింది. దీంతో టీటీడీ ఛైర్మన్ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు. పృధ్వీ విషయం ఇప్పటికే సీఎం దృష్టిలో ఉందని, నిజానిజాలు తేల్చడానికి విజిలెన్స్ ఎంక్వైరీ వేశామని చెప్పారు. విచారణలో వాస్తవమని తేలితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా.. అనవసర కామెంట్లు చేస్తున్నారని పృధ్వీరాజ్ పై వైసీపీ అధిష్ఠానం కూడా ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఆయనని పదవి నుండి తప్పించవచ్చని అంటున్నారు.

 

More Related Stories