English   

ఎస్వీబీసీ చైర్మన్‌ పదవికి పృథ్వీరాజ్‌ రాజీనామా...ఇప్పుడు సంగతి తేలుస్తారట...

Prudhvi Raj.jpg
2020-01-12 23:17:53

అనుకున్నదంతా అయ్యింది. ఎస్వీబీసీ చైర్మన్‌ పృథ్వీరాజ్‌పై వేటు పడింది. ఎస్వీబీసీ మహిళా సిబ్బందితో తప్పుగా వ్యవహరించారన్న ఆరోపణలపై చర్యలు తీసుకుంది టీటీడీ. దీంతో నాలుగు నెలల్లోనే పదవి కోల్పోయారు పృథ్వీ. ప్రభుత్వ పెద్దల ఆదేశాలతో ఎస్వీబీసీ చైర్మన్ పదవికి పృథ్వీ రాజీనామా చేశారు. ఎన్నో ఏళ్లుగా తాను పార్టీ కోసం పని చేశానన్న ఆయన జగన్ తన పనిని చూసే ఎస్వీబీసీ ఛైర్మన్ పదవి ఇచ్చారని తెలిపారు. కొందరు తనను కావాలనే దెబ్బకొట్టాలని చూశారని ఆరోపించారు. రాజధాని రైతులందరినీ పెయిడ్ ఆర్టిస్టులని అనలేదని తెలిపారాయన. కార్పోరేట్ రైతులను మాత్రమే విమర్శించినట్టు స్పష్టం చేశారు పృథ్వీ.

రైతులపై పెయిడ్ ఆర్టిస్టుల వ్యాఖ్యలతో మొదలైన వివాదం.. అటు తిరిగి ఇటు తిరిగి పృథ్వీరాజ్‌ మీదకు వచ్చింది. పోసాని సహా వైసీపీ నేతలు తప్పుపట్టడంతో తన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు పృథ్వీ. దీంతో వివాదం సద్దుమణిగిందని అనుకున్నారు. ఇంతలోనే ఓ మహిళతో పృథ్వీ మాట్లాడిన ఆడియో టేపు బయటకు వచ్చింది. అది కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మహిళా సంఘాలు ఆందోళన చేశాయి. పృథ్వీని ఎస్వీబీసీ చైర్మన్‌ పదవి నుంచి తొలగించాలనే డిమాండ్‌ వచ్చింది. ఈ వ్యవహారంపై సీరియస్‌ అయిన టీటీడీ ఛైర్మన్‌ దర్యాప్తునకు ఆదేశించారు. ఏం జరిగిందో తేల్చాల్సిందిగా విజిలెన్స్‌ను ఆదేశించారు. ముఖ్యమంత్రి సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాల్సిందిగా ఆదేశించారు. ఇదే విషయాన్ని టీటీడీ ఛైర్మన్‌ పృథ్వీ దృష్టికి తీసుకెళ్లడంతో రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారాయన.

కొందరి కుట్రలకు తాను బలయ్యానని పదవికి రాజీనామా చేసిన అనంతరం ఆయన వాపోయాడు. అయితే ఇక ఎవరినీ ఉపేక్షించనని... రాజీనామా చేశాను కాబట్టి అందరి సంగతి తేలుస్తానన్నారు. తాను అనని మాటల్ని కొందరు వక్రీకరించారన్నారు పృథ్వీ.  తాను పద్మావతీ గెస్ట్‌హౌస్‌లో మహిళతో అసభ్యకర ఫోన్ సంభాషణ చేశానని. చెబుతున్న టేపులో తన గొంతును మార్ఫింగ్ చేశారని ఆరోపించారు. తనకు ఎప్పటికీ పోసాని స్నేహితుడేనని చెప్పుకొచ్చారు.

రెండురోజులక్రితం రాజధాని ఆందోళనలను ప్రస్తావిస్తూ.. పెయిడ్ ఆర్టిస్టులతో చేస్తున్నారని పృద్వి ఆరోపించారు.  కళ్లు చెదిరే కార్లు, ఆభరణాలు ధరించి వచ్చి ఆందోళన చేసే వారిని ఇక్కడే చూస్తున్నానన్నారు. ఓ సామాజిక వర్గానికి చెందినవారే ఇలాంటి ఆందోళనలు చేస్తున్నారని నిజమైన రైతులెవరూ వారిలో లేరన్నారు పృధ్వీ.

More Related Stories