English   

సరిలేరు నీకెవ్వరు రెండోరోజు పరిస్థితేంటి..

Sarileru Nekevvaru second day Collections.jpg
2020-01-12 23:37:00

మహేష్ బాబు హీరోగా వచ్చిన సరిలేరు నీకెవ్వరు సినిమా తొలిరోజు వసూళ్ల వర్షం కురిపించింది. ఏకంగా 46 కోట్లకు పైగా షేర్ వసూలు చేసింది ఈ చిత్రం. మహేష్ బాబు కెరీర్లోనే టాప్ గ్రాసర్ గా నిలిచింది. ఒకేరోజు అన్ని కోట్లు వచ్చేసరికి పండగ చేసుకుంటున్నారు నిర్మాతలు కూడా. అయితే రెండోరోజు పరిస్థితి ఏంటి అనేది మాత్రం ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

అల వైకుంఠపురములో రావడం.. దానికి పాజిటివ్ టాక్ రావడంతో మహేష్ సినిమాకు మంచి వసూళ్లు వచ్చాయా లేదా అనేది ఆసక్తికరంగా మారింది. పైగా థియేటర్స్ సంఖ్య కూడా బాగానే తగ్గిపోయింది. తొలిరోజుతో పోలిస్తే సగం స్క్రీన్స్ తీసుకున్నారు అల వైకుంఠపురం కోసం. దాంతో కలెక్షన్లపై కచ్చితంగా ప్రభావం పడుతుంది. ఇక సినిమాకు టాక్ కూడా యావరేజ్.. పర్లేదు.. మాస్ సినిమా అంటున్నారే కానీ సంక్రాంతి విన్నర్ అయ్యే లక్షణాలు మాత్రం పక్కాగా చెప్పడం లేదు. దాంతో ఇప్పట్నుంచి వసూళ్లు ఎలా ఉంటాయనేదానిపైనే సరిలేరు నీకెవ్వరు ఫ్యూచర్ డిసైడ్ చేయనుంది.

రెండోరోజు కనీసం 10 కోట్ల వరకు షేర్ వస్తుందని అంచనాలు వేస్తున్నా కూడా 5 నుంచి 7 కోట్ల వరకు వస్తాయని నమ్ముతున్నారు బయ్యర్లు. మొత్తానికి చూడాలిక.. రాబోయే రోజుల్లో సరిలేరు నీకెవ్వరు దూకుడు ఎలా ఉండబోతుందో..? 

More Related Stories