English   

కంగ్రాట్స్ బావ కుమ్మేసావ్.. బన్నీకి జూనియర్ ప్రశంస..

ntr
2020-01-13 04:57:00

ఇండస్ట్రీలో ఇప్పుడు మన హీరోల మధ్య స్నేహం బాగా పెరిగిపోయింది. బన్నీ, మహేష్ కూడా బయటికి అలా అనుకుంటున్నారు కానీ వాళ్లు కూడా లోపల మంచి ఫ్రెండ్స్ అంటున్నారు తెలిసిన వాళ్లు. అయితే ప్రస్తుతం సంక్రాంతి బరిలో ఉన్నారు కాబట్టి అది బయటికి రావడం లేదు అంతే. ఇప్పుడు బన్నీ నటించిన అల వైకుంఠపురములో సినిమా తొలిరోజే అద్భుతమైన టాక్ తెచ్చుకుంది. త్రివిక్రమ్ నుంచి ఇలాంటి సినిమా వచ్చి చాలా కాలమైంది అంటున్నారు ప్రేక్షకులు కూడా. దాంతో సినిమా దమ్ములేపడం ఖాయం అయిపోయింది. ఇక ఈ సినిమాకు సాధారణ ప్రేక్షకులే కాదు.. సెలెబ్రిటీస్ కూడా ఫిదా అయిపోతున్నారు. ముఖ్యంగా సినిమా చూసిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ తన రివ్యూ ఇచ్చేసాడు. బన్నీని ఉద్దేశించి బావా కుమ్మేసావ్.. కంగ్రాట్స్ అంటూ ట్వీట్ చేసాడు జూనియర్. ఈ ట్వీట్ చూసిన తర్వాత బన్నీ ఫ్యాన్స్ కూడా ఖుషీ అవుతున్నారు. అభిమానుల్లో ఆరోగ్య వాతావరణాన్ని పెంచడానికి ఇది చాలా హెల్ప్ చేస్తుందంటున్నారు విశ్లేషకులు కూడా. పైగా బన్నీ, జూనియర్ చాలా మంచి ఫ్రెండ్స్. తన త్రివిక్రమ్ శ్రీనివాస్ ను కూడా చాలా మర్యాదగా స్వామి అంటూ సంభోదించాడు ఎన్టీఆర్. మురళీ శర్మ నటనకు ఫిదా అయిపోయాడు యంగ్ టైగర్. ఇలా ఎవరికి వాళ్లు సినిమాలో ఇరక్కొట్టేసారని తన రివ్యూ ఇచ్చేసాడు జూనియర్ ఎన్టీఆర్.

More Related Stories