English   

కిరాక్ లుక్‌తో క్రాక్ పుట్టిస్తున్న మాస్ రాజా రవితేజ.. 

Ravi Teja
2020-01-13 10:56:54

రవితేజను ఇప్పుడు చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. ఈయన చాలా బిజీగా ఉన్నాడిప్పుడు. వరస సినిమాలకు కమిట్ అవుతూ మస్త్ బిజీ అయిపోయాడు మాస్ రాజా. ప్రస్తుతం ఈయన డిస్కో రాజా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ చిత్రం తర్వాత గోపీచంద్ మలినేనితో సినిమా చేయబోతున్నాడు. ఈయన హీరోగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో సినిమా ఈ మధ్యే అనౌన్స్ మెంట్ కూడా వచ్చేసింది. లైట్‌ హౌస్‌ మూవీ మేకర్స్‌ బ్యానర్‌పై ఠాగూర్‌ మధు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు.

 ఇప్పుడు ఈ చిత్ర ఓపెనింగ్ కూడా జరిగింది. దీనికి క్రాక్ అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టారు దర్శక నిర్మాతలు. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ చిత్రం వస్తుందని పోస్టర్ పైనే చూపించేసారు దర్శకుడు గోపీచంద్. శృతిహాసన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తుంది. మూడేళ్ల తర్వాత ఈమె తెలుగులో నటిస్తున్న సినిమా ఇది. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్‌ పనులు వేగంగా జరుగుతున్నాయి. కాగా ఈ చిత్రం తమిళనాట బ్లాక్ బస్టర్ గా నిలిచిన తెరీ సినిమాకు రీమేక్ అని తెలుస్తుంది. విజయ్ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని అట్లీ తెరకెక్కించాడు. అక్కడ సూపర్ హిట్ అని తెరీని తెలుగులో పోలీసోడు అంటూ తీసుకొచ్చారు. 

అయితే అంత విజయం సాధించలేదు.. ఇప్పుడు ఈ సినిమాను తెలుగులో రవితేజతో రీమేక్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఎస్‌.ఎస్‌.తమన్‌ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. రవితేజతో థమన్ కు మంచి అనుబంధం ఉంది. ఈ కాంబినేషన్ లో కిక్ నుంచి మొదలై చాలా సినిమాలు వచ్చాయి. తాజాగా మరోసారి ఈ హీరో చిత్రానికి పాటలు ట్యూన్ చేయబోతున్నాడు థమన్. పైగా మనోడు మంచి ఫామ్ లో కూడా ఉన్నాడు ఇప్పుడు. కొన్నేళ్లుగా దూరంగా ఉన్న ఈ కాంబినేషన్ ను ఇప్పుడు గోపీచంద్ మలినేని కలిపాడు. ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం సిక్స్ ప్యాక్ కూడా చేస్తున్నాడు రవితేజ. తాజాగా ఈయన లుక్ బయటికి వచ్చింది. ఇది చూస్తుంటే వారెవా అనుకోకుండా ఉండలేరు. 2020 సమ్మర్ లో ఈ సినిమా విడుదల కానుంది.

More Related Stories