English   

జీ సినీ అవార్డులు...సెన్సేషన్ గా ఇస్మార్ట్ శంకర్

 Zee Cine Awards
2020-01-13 11:36:02

2019 ఏడాదికి గాను  జీ ఛానెల్ అవార్డులను ప్రకటించింది. ‘జీ సినీ తెలుగు అవార్డ్స్ ’ ప్రదానోత్సవ కార్యక్రమం శనివారం రాత్రి హైదరాబాద్‌లో జరిగింది. ఈ అవార్డ్స్ లో ‘ఇస్మార్ట్ శంకర్’ ఏకంగా ఐదు విభాగాల్లో అవార్డులను సొంతం చేసుకోవడం విశేషం. ఈ అవార్డుల్లో సైరా నరసింహారెడ్డి సినిమాకి గాను బెస్ట్ నటుడిగా చిరంజీవి, మజిలీ, ఓ బేబీ చిత్రాలకు గాను బెస్ట్ నటిగా సమంత అవార్డులు దక్కించుకున్నారు. 

ఇక మరోపక్క సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు కేమో ట్విటర్‌ స్టార్‌ అవార్డు దక్కింది. బెస్ట్ సెన్సేషనల్ డైరెక్టర్ అవార్డును పూరి జగన్నాథ్ అందుకున్నారు. బెస్ట్ సెన్సేషనల్ అవార్డు రామ్‌కు దక్కింది. ఇక బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డును ఛార్మి, బెస్ట్ మ్యూజిక్ అవార్డును మణిశర్మ గెలుచుకున్నారు. బెస్ట్ సెన్సేషనల్ మూవీ అవార్డు కూడా ఈ సినిమాకే దక్కింది. మొత్తంగా చూసుకుంటే ఐదు అవార్డులను కొల్లగొట్టింది. మెగాస్టార్‌ కుమార్తె సుష్మిత సైరా చిత్రానికి గాను బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా అవార్డు అందుకున్నారు. అలాగే కళాతపస్వీ కె విశ్వనాథ్‌ను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించారు.
ఇక మొత్తంగా ఈ అవార్డులు ఎవరవరికి వచ్చాయో చూస్తే :

బెస్ట్ యాక్టర్ : చిరంజీవి(సైరా నరసింహారెడ్డి)
బెస్ట్ నటి : సమంత(మజిలీ, ఓ బేబీ)
బెస్ట్‌ ఫైన్డ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ : శ్రద్ధా శ్రీనాథ్‌(జెర్సీ)

బెస్ట్ సహాయ యాక్టర్ : అల్లరి నరేష్‌(మహర్షి)
బెస్ట్ హాస్యయాక్టర్ : రాహుల్‌ రామకృష్ణ, ప్రియదర్శి(బ్రోచేవారెవరురా)

ఫెవరెట్‌ యాక్టర్‌ ఆఫ్‌ ది ఇయర్‌ : నాని(జెర్సీ)
ఫెవరెట్‌ నటి : పూజా హెగ్డే (మహర్షి)

బెస్ట్ నిర్మాత : ఛార్మి(ఇస్మార్ట్‌ శంకర్‌)
సెన్సేషనల్‌ స్టార్‌ ఆఫ్‌ ది ఇయర్‌ : రామ్‌ (ఇస్మార్ట్‌ శంకర్‌)
బెస్ట్‌ సెన్సేషన్‌ డైరక్టర్‌ : పూరి జగన్నాథ్‌(ఇస్మార్ట్‌ శంకర్‌)
బెస్ట్ సంగీత దర్శకుడు : మణిశర్మ (ఇస్మార్ట్‌ శంకర్‌)
బెస్ట్ సింగర్ : సిద్‌ శ్రీరామ్‌ (కడలల్లే)
ఫేవరెట్‌ అల్బమ్‌ ఆఫ్‌ ది ఇయర్‌ : జస్టిన్‌ ప్రభాకరన్‌(డియర్‌ కామ్రేడ్‌)
బెస్ట్ విలన్‌ : తిరువీర్ (జార్జిరెడ్డి)
బెస్ట్ స్ర్కీన్‌ప్లే : వివేక్‌ ఆత్రేయ (బ్రోచేవారెవరురా)
బెస్ట్ డెబ్యూ  నటి : శివాత్మిక రాజశేఖర్‌( దొరసాని)
బెస్ట్ డెబ్యూ యాక్టర్ : ఆనంద్‌ దేవరకొండ(దొరసాని)
బెస్ట్ సినిమాటోగ్రాఫర్‌ : రత్నవేలు(సైరా)
న్యూ సెన్సేషన్‌ ఆఫ్‌ ది ఇయర్‌ : తరుణ్‌ భాస్కర్‌ (మీకు మాత్రమే చెప్తా)
బెస్ట్ సింగర్ : చిన్నయి (ప్రియతమా.. మజిలీ)
ఫేవరెట్‌ డెబ్యూ డైరక్టర్‌ : స్వరూప్‌ ఆర్‌ఎస్‌జే(ఏజెంట్‌ సాయి శ్రీనివాస ఆత్రేయ)
ఫేవరెట్‌ సపోర్టింగ్‌ యాక్టర్‌ : నీల్‌ నితీశ్ ముఖేష్‌‌(సాహో) 

More Related Stories