English   

అల వైకుంఠపురములో ఫస్ట్ డే కలెక్షన్స్.. బన్నీ కెరీర్లో హైయ్యస్ట్.. 

 Ala Vaikunthapurramloo
2020-01-13 18:46:01

సంక్రాంతి సినిమాలకు పండగ సెలవులు బాగానే కలిసొస్తున్నాయి. ఆదివారం విడుదల కావడంతో బన్నీ సినిమాకు ఆకాశమే హద్దు అయిపోయింది. క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అన్నిచోట్లా కూడా అల వైకుంఠపురములో దుమ్ము దులిపేసింది. త్రివిక్రమ్ మార్క్ మాటలకు తోడు ఎమోషన్స్ కూడా సరిగ్గా పండటంతో పండగ చేసుకుంటుంది ఈ చిత్రం. ముఖ్యంగా అన్ని ఏరియాల్లో కూడా బన్నీ గత సినిమాల రికార్డులను ఈజీగా క్రాస్ చేసింది అల వైకుంఠపురములో. ఇండియాలోనే కాదు ఓవర్సీస్ లో కూడా రప్ఫాడిస్తున్నాడు బన్నీ. 

తెలుగు రాష్ట్రాల్లోనే ఈ చిత్రం తొలిరోజు దాదాపు 22 కోట్ల షేర్ వసూలు చేసినట్లు తెలుస్తుంది. సరిలేరు నీకెవ్వరు కంటే ఇది తక్కువే కానీ బన్నీ రేంజ్ కు మాత్రం ఇదే హయ్యస్ట్. అతడి కెరీర్ లో కూడా ఇదే బెస్ట్ ఓపెనింగ్. ఓవర్సీస్ కూడా కలుపుకుంటే తొలిరోజే 28 కోట్ల వరకు షేర్ రాబట్టినట్లు ప్రచారం జరుగుతుంది. నైజాంలో కూడా 6 కోట్లకు పైగానే వసూలు చేసింది ఈ చిత్రం. ప్రపంచ వ్యాప్తంగా 77 కోట్ల బిజినెస్ చేసింది అల వైకుంఠపురములో. మరి రాబోయే రోజుల్లో ఈ చిత్ర వసూళ్లు ఎలా ఉండబోతున్నాయో చూడాలిక. 

More Related Stories