రామ్ చరణ్ హీరోయిన్ సెగలు పుట్టిస్తుందిగా..

కొందరు హీరోయిన్లు అస్సలు మాట తప్పరు. ఏదైతే చేయాలనుకుంటారో అదే చేస్తారు. ఎప్పుడూ ఒకేమాట మీదుంటారు. అందులో ఇషాగుప్తా అందరి కంటే ముందుంటుంది. ఈ భామకు సినిమాలు అస్సలు ఆఫ్ట్రాల్. కేవలం సోషల్ మీడియా ఫాలోయింగ్ తో బతికేస్తుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పుడు కూడా ఇదే చేసింది. అయినా ఏ హీరోయిన్ అయినా సినిమాలు చేస్తూ.. మధ్యమధ్యలో ఫోటోషూట్లు చేస్తుంటారు. ఇంకొందరు ఫోటోషూట్లు చేస్తూ సినిమాలు చేస్తుంటారు. కానీ కొందరు మాత్రం కేవలం ఫోటోషూట్లతోనే అవాకాశాలు సంపాదిస్తుంటారు. ఇషాగుప్తా ఈ లిస్ట్ లోకి వచ్చే ముద్దుగుమ్మే.
ఈమె తన అందాన్నంతా ధారపోస్తుంది. ఎంతలా అంటే.. బట్టలేసుకోవడమే మహాపాపం అన్నట్లుంది ఈషాగుప్తా తీరు చూస్తుంటే. అరె.. ఓ ఫోటోషూట్ చేసి చూపు తిప్పుకునే లోపు మరో హాట్ ఫోటోషూట్ తో మతులు పోగొడుతుంది ఈ ముద్దుగుమ్మ. మ్యాగజైన్లపై ఫోజులివ్వడం తప్ప మరే పని పెట్టుకున్నట్లు కనిపించ ట్లేదు ఈషాగుప్తా. అడిగిందే తడువుగా అందరికీ అందాల విందు ఇచ్చేస్తుంది ఈ ముద్దుగుమ్మ. దమ్ముంటే కాస్కోండి అంటూ రెచ్చిపోతుంది. కొన్ని రోజుల నుంచి ఈమె చేస్తోన్న రచ్చకు సోషల్ మీడియా అంతా వేడెక్కిపోతుంది. అడిగితే అంతా నా యిష్టం అంటుంది. నా అందాలు చూసి తట్టుకోలేకపోతున్నారా అంటూ రివర్స్ అటాక్ చేస్తుంది.
తాజాగా మరోసారి హాట్ హాట్ అందాలతో స్క్రీన్ ను షేక్ చేసింది ఈ భామ. ఇప్పుడు స్విమ్మింగ్ పూల్ లో బికినీ వేసుకుని హీట్ ఎక్కించింది ఈ భామ. ఆ మధ్య తెలుగులో వినయ విధేయ రామ సినిమాలో స్పెషల్ సాంగ్ చేసింది ఈషా గుప్తా. రామ్ చరణ్ అంటే తనకు ఇష్టమని చెప్పిన ఇషా.. అతడితో వచ్చిన అవకాశాన్ని బాగానే వాడేసుకుంది. కానీ సినిమా ఫ్లాప్ కావడంతో ఇషా జాతకం మారలేదు. అవకాశం వస్తే తెలుగులోనూ తన సత్తా చూపిస్తానంటుంది ఈ ముద్దుగుమ్మ. మరి ఈమె సెగలు ఎప్పటికి తగ్గేనో చూడాలిక..!