వైసీపీ నేత నటుడు కృష్ణుడికి పితృవియోగం..

2020-01-13 14:06:15
వినాయకుడు సినిమాతో తెలుగులో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటుడు కృష్ణుడు. ఆ తర్వాత కూడా విలేజ్ లో వినాయకుడు సినిమా చేసాడు. దాంతోపాటే చాలా సినిమాల్లో కారెక్టర్ ఆర్టిస్టుగా నటించాడు ఈయన. ఆ తర్వాత బరువు తగ్గిపోయి పూర్తిగా సినిమాలకు దూరంగా జరిగాడు. ప్రస్తుతం ఈయన రాజకీయాలతో బిజీగా ఉన్నాడు. ఈయన కుటుంబంలో విషాదం జరిగింది. కృష్ణుడు తండ్రి అల్లూరి సీతారామరాజు మృతి చెందారు. కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఈయన ఆస్పత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూసారు. భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఈయన మరణించారు. జనవరి 13న అంత్యక్రియలు జరపనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈయన మరణానికి పలువురు వైసీపీ నేతలు, సినిమా ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తంచేసారు.