English   

సంక్రాంతి సినిమాలకు పైరసీ గోల.. అప్పుడే ఆన్‌లైన్‌లో.. 

mahesh allu arjun
2020-01-13 16:58:16

పైరసీ.. ఇప్పుడు ఈ మాటే నిర్మాతలకు నిద్ర లేకుండా చేస్తుంది. కనీసం ఒకటి రెండు రోజులు ఆగితే అయినా పరిస్థితి మరోలా ఉంటుందేమో కానీ.. బయట టికెట్స్ కోసం అభిమానులు కొట్టుకుంటుంటే.. బుక్ మై షోలో టికెట్స్ దొరకడం లేదంటూ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతుంటే.. అప్పుడే సంక్రాంతి సినిమాలు ఆన్ లైన్ లో పైరసీ రావడం కంటే దారుణం మరోటి ఉండదు. ఇప్పుడు సంక్రాంతి అన్ని సినిమాల పరిస్థితి ఇలాగే ఉంది. ఈ సినిమాల విషయంలో ఇదే జరుగుతుంది. ఈ సినిమాలన్నీ ఫస్ట్ షో కంటే ముందే అప్పుడే ఆన్ లైన్ లో కనిపించడం నిర్మాతలకు రక్తకన్నీరు తెచ్చిపెడుతుంది. 

ముఖ్యంగా బయ్యర్ల పరిస్థితి తులచుకుంటేనే ఏడుపు వచ్చేస్తుంది. సంక్రాంతి సినిమాలన్నింటికి మంచి టాక్ వచ్చింది. అల వైకుంఠపురములో అయితే బ్లాక్ బస్టర్ టాక్ తో ఓపెన్ అయింది.. సరిలేరు నీకెవ్వరు కూడా కమర్షియల్ సినిమా అనిపించుకుంది. దర్బార్ కూడా కొన్ని ఏరియాల్లో మంచి టాక్ తెచ్చుకుంది. ఈ మూడు సినిమాలు ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర రచ్చ చేస్తున్నాయి. ఎవరికి వాళ్లు రప్ఫాడిస్తున్నారు. మహేష్ బాబు అయితే అగ్ర తాంబూలం తీసుకున్నాడు. బాక్సాఫీస్ ను పూర్తిగా దత్తత తీసుకుంటున్నాడు సూపర్ స్టార్. బన్నీ కూడా తనవంతుగా దుమ్ము దులిపేస్తున్నాడు.

ఈ రెండు సినిమాలు నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి. ఇలాంటి సమయంలో పైరసీ కూడా అలాగే వచ్చేస్తుంది. నువ్వా నేనా అన్నట్లుగా సైట్లు పోటీ పడి మరీ సంక్రాంతి సినిమాల పైరసీ లింకులను ఆన్ లైన్ లో పోస్ట్ చేస్తున్నారు. నిజంగా నిర్మాతలకు ఇంతకంటే దారుణమైన పరిస్థితి మరోటి లేదు. ఓపెనింగ్స్ అదిరిపోతున్నా కూడా పైరసీ కూడా విచ్చలవిడిగా ఉండటంతో ఏం జరగబోతుందో అనే టెన్షన్ అందర్లోనూ కనిపిస్తుంది. ఇలాంటి సమయంలో పైరసీ రావడం దారుణం అనిపిస్తుంది. కొన్ని వెబ్ సైట్లు అయితే పగలు రాత్రి నిద్ర కూడా మానుకుని ఈ కొత్త సినిమాల కోసమే వేచి చూస్తున్నాయి. 

పెద్ద సినిమాలు విడుదల కాగానే కనీసం ఫస్ట్ షో కూడా పడకముందే వాళ్ల సైట్లో పెట్టేస్తున్నారు. రివ్యూ కంటే ఫాస్టుగా ఆన్ లైన్ పైరసీ రావడంతో కొందరు పైరసీ ప్రియులు ఇదే అదునుగా డౌన్ లోడ్ చేసుకుని సినిమా ఇంట్లోనే చూస్తున్నారు. ఇది నిజంగానే నిర్మాతలకు కొంప ముందే యవ్వారం. దీనిపై ఎన్ని టీమ్స్ వర్క్ చేస్తున్నా కూడా సైబర్ నేరగాళ్లు మాత్రం ఆగడం లేదు. ఇప్పుడు కూడా ఇదే జరిగింది. తమిళ్ రాకర్స్‌తో పాటు మరికొన్ని సైట్లలో ఇప్పటికే సంక్రాంతి సినిమాలన్నీ దర్శనమిస్తున్నాయి. దాంతో దర్శక నిర్మాతలకు భయం పట్టుకుంది. మరి ఇది సినిమాలపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందనేది చూడాలి.

More Related Stories