English   

బావ కళ్ళలో ఆనందం కోసం మహేష్ కి హ్యాండిచ్చిన ఎన్టీఆర్

ntr
2020-01-13 19:31:04

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన క్రేజీ మూవీ ‘అల వైకుంఠపురములో’. పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా భారీ అంచనాల నడుమ నిన్న విడుదలైంది. ఈ సినిమాకి తొలి ఆట నుండే హిట్ టాక్ వచ్చింది. అందుకే ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా యూఎస్‌లోనూ వసూళ్ల వర్షం కురిపిస్తోంది ఈ చిత్రం. సినిమాను జనంలోకి మరింతగా తీసుకెళ్లడానికి సినిమా యూనిట్ కూడా రకరకాల ప్రచారం చేస్తోంది. ఈ క్రమంలో ‘అల వైకుంఠపురములో’ సినిమాపై ప్రశంసలు కురిపిస్తూ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం ఆసక్తిగా మారింది. ఈ సినిమా బాగుందని ప్రశంసిస్తూ నిన్న ఎన్టీఆర్ ట్వీట్ చేశారు. అల్లు అర్జున్‌ను బావ అని సంబోధిస్తూ అభినందనలు తెలిపారు.

బన్నీ యాక్టింగ్ ని, త్రివిక్రమ్ డైరెక్షన్ ని, మురళి శర్మ పెర్ఫార్మెన్స్ ని, పీఎస్ వినోద్ కెమెరా వర్క్ ని, థమన్ సంగీతాన్ని, హారిక హాసిని నిర్మాణ విలువలను పొగుడుతూ ఎన్టీఆర్ ట్వీట్ సాగింది. ఈ ట్వీట్ లో బన్నీని బావ అని, త్రివిక్రమ్ ని స్వామి అని ఈ సందర్భంగా ఎన్టీఆర్ సంబోధించడం విశేషం. అయితే మహేష్ బాబు సరిలేరు నీకెవ్వరూ గురించి ఎన్టీఆర్ ఇప్పటివరకు ట్వీట్ చెయ్యకపోవడంతో కేవలం బన్నీ సినిమాని ప్రమోట్ చేస్తున్నాడని అంటున్నారు. నిజానికి ఎన్టీఆర్ కి బన్నీ, మహేష్ బాబులు ఇద్దరితో మంచి సంబంధాలు ఉన్నాయి గతంలో మహేష్ బాబు భారత్ అనే నేను సినిమా ప్రీ-రిలీజ్ వేడుకకు ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా కూడా వెళ్లి సంచలనం రేపాడు. ఇప్పుడు ఏమైందో మరి బన్నీ సినిమాని ఎత్తేస్తున్నాడు. కానీ ఆయన అభిమానులు మాత్రం ఎన్టీఆర్ ఇలా వన్ సైడ్ తీసుకోడని ఈరోజో రేపో సరిలేరు నీకెవ్వరూ గురించి కూడా ట్వీట్ వేస్తారని అంటున్నారు. చూడాలి ఏమి జరగనుందో ?

More Related Stories