English   

ఎన్టీఆర్ కి మహేష్ కి చెడిందా 

 NTR
2020-01-14 11:51:09

సంక్రాంతి అంటే తెలుగు సినిమాకి అచ్చొచ్చే సీజన్. ఈ సీజన్ లో ఎలా అయినా సినిమా రిలీజ్ చేయాలని భావిస్తుంటారు హీరోలు. ఈ ఏడాది కూడా ఇద్దూర్ పెద్ద హీరోల సినిమాలు రిలీజయ్యాయి. అయితే ముందు వచ్చిన చెవులు కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అన్నట్టుగా ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా అల వైకుంఠపురంలో చిత్రాన్ని ఓ రేంజ్ లో పొగిడేశాడు. బన్నీ అద్భుతంగా నటించాడు…త్రివిక్రమ్ చిత్రాన్ని ఉన్నతంగా మలిచాడు, ఓ గొప్ప మూవీ చూసిన భావన కలిగిందని చెబుతూ ట్వీట్ చేశారు. అక్కడితో ఆగక బెస్ట్ విశెష్ బావా అని బన్నీకి శుభాకాంక్షలు తెలిపారు. 

అలాగే సినిమాలో కీలక పాత్ర చేసిన మురళి శర్మతో పాటు సాంకేతిక నిపుణులపై కూడా ఎన్టీఆర్ ప్రసంశల వర్షం కురిపించారు. ఐతే మహేష్ తో ఎంతో సన్నిహితంగా ఉంటున్న తారక్, మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రం గురించి స్పందించకపోవడం జనాలలో ఆశ్చర్యం రేకెత్తిస్తోంది. అల వైకుంఠపురంలో మూవీ కంటే మహేష్ మూవీ ఒక రోజు ముందే విడుదల అయ్యింది. అయినప్పటికీ తారక్ ఆ చిత్రం గురించి కనీసం స్పందించక పోవడం ఇప్పుడు చర్చనీయామాశంగా మారింది. 

అసలు ఆయన మహేష్ సినిమా ఇంకా చూడలేదా? ..ఒక వేళ చూసినా స్పందించలేదా? అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు నెటిజన్లు. విడుదలైన రెండు సినిమాలకి మొదటి ఆట నుండే పాజిటివ్ టాక్ వచ్చినా కేవలం బన్నీ సినిమానే పొగుడుతూ ఎన్టీఆర్ ట్వీట్ చేయడం వెనుక ఆంతర్యం ఏమిటో ఒక పట్టాన అర్థం కావడం లేదు. అయితే మహేష్ కి ఎన్టీఆర్ కి చెడిందని కూడా ప్రచారం సాగుతోంది. మరి అందులో నిజం ఎంతుందో తెలీదు కానీ ప్రచారం అయితే ఒక రేంజ్ లో జరుగుతోంది. 

ఒకానొక సమయంలో మహేష్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి వెళ్ళాడు ఎన్టీఆర్. అయితే ఇప్పుడు ఆ విషయాన్ని ప్రస్తావిస్తూ అసలు ఆయన వెళ్ళింది కొరటాల శివ కోసమే నని మహేష్ అంటే ఇష్టం లేదని మహేష్ అభిమానులు ప్రచారం చేస్తున్నారు. నిజానికి తాత గారైన ఎన్టీఆర్ బయోపిక్, బాలయ్య ప్రతిష్టాత్మకంగా తీస్తే ఆ చిత్రం గురించి కనీసం నోరు మెదపలేదు ఎన్టీఆర్. అలాంటిది బన్నీ సినిమాని ఎందుకు పొగిడాడు ? మా హీరోను అవమానించడానికే అని ఆయన అభిమానులు మండిపడుతున్నారు. ఐతే ఎన్టీఆర్ ఎంత మంచివాడవురా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మహేష్ సినిమా కూడా హిట్ అవ్వాలని కోరుకున్నాడన్న విషయం వారికి గుర్తు లేదేమో బహుశా ?

More Related Stories