English   

విజయ్ సలహా పట్టించుకోని రష్మిక..ఆడేసుకుంటున్న నెటిజన్లు

Rashmika Mandanna
2020-01-14 12:02:32

నెట్టింట్లో ఎలాంటి లిమిట్స్‌ లేవు. ఎవరు, ఎవరినైనా నిందించొచ్చు. ట్రోల్‌ చేయొచ్చు. అదీ నేటి నెట్టింటి పరిస్థితి. ముఖ్యంగా సెలబ్రిటీల విషయంలో సోషల్ మీడియా చుక్కలు చూపిస్తోంది. సెలబ్రిటీల నుండి ఏ చిన్న తప్పు జరిగినా ఓ ఆట ఆడేసుకుంటున్నారు నెటిజన్లు. మొహమాటం లేకుండా, ఆడేసుకుంటున్నారు. 

తాజాగా ఇప్పుడు రష్మిక మందనని నెటిజన్లు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఎందుకంటే ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో ఆమె పాత్ర గురించే. ఇప్పటి వరకు గౌరవ ప్రధమైన పాత్రలు చేసిన రష్మిక. సరిలేరు నీకెవ్వరు సినిమాలో మాత్రం మరీ కూరలో కరివేపాకు లాంటి పాత్ర చేసింది. ఆ పాత్రని కేవలం కామెడీ కోసం అలాగే ఒకటి రెండు సాంగ్స్ కోసం వాడుకున్నారుతప్ప ఆ పాత్రకు సినిమాలు ఎటువంటి ప్రాముఖ్యత లేదు. ఇన్ని రోజులు రష్మీక చాలా స్పెషల్  అనుకున్నవారికి ఈ సినిమాలోని ఆమె పాత్ర పెద్ద షాకే ఇచ్చింది. 

గీత గోవిందం సినిమా తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ఆమె చెప్పుకొచ్చింది. ఏదో సినిమా చేశాము అంటే చేశాము అనుకునే సినిమాలు చేయనని తగిన ప్రాముఖ్యత ఉంటేనే చేస్తానని ఆమె చెప్పుకొచ్చింది. అప్పుడే పక్కనున్న విజయ్ ముందే చెబుతున్నా అలంటి పాత్రలు చేస్తే ట్రోల్ చేస్తారు ఇక నీ ఇష్టం అని చెప్పుకొచ్చాడు. అప్పుడు లైట్ తీసుకున్న ఆ భామ మీద ఇప్పుడు ఒక రేంజ్ లో ట్రోల్స్ నడుస్తున్నాయి. అలాగే మీకు అర్ధమవుతోందా ? అంటూ ఆమె చేస్తున్న కామెడీ మీద కూడా ట్రోల్స్ నడుస్తున్నాయి.

More Related Stories