English   

బీజేపీతో పవన్ పార్టీ పొత్తా.. విలీనమా 

Pawan Kalyan
2020-01-14 12:49:19

ఏపీలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. సార్వత్రిక ఎన్నికల తర్వాత రెండోసారి ఢిల్లీ వెళ్లిన పవన్.. బీజేపీ నేతలతో పాటు ఆరెస్సెస్ నేతల్ని కూడా కలిశారు. మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత ఏపీలో జరుగుతున్న పరిణామాల్నివివరించారు. జనసేన, బీజేపీ మధ్య భవిష్యత్తులో పొత్తుకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. 

నిన్న పవన్ కల్యాణ్ బీజేపీ ముఖ్య నేతలతో సోమవారం భేటీ అయ్యారు. బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగత్ ప్రకాష్ నడ్డాను ఆయన నివాసానికి వెళ్లి కలిశారు. అదే సమయంలో.. బీజేపీ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, ఎంపీ తేజస్వి సూర్య కూడా నడ్డా నివాసంలో ఉన్నారు. సీఎం జగన్ మూడు రాజధానుల ప్రతిపాదన తర్వాత.. రాష్ట్రంలో దాదాపు నెల రోజులుగా జరుగుతున్న పరిణామాలపై ఆయన కేంద్ర పెద్దలతో చర్చించినట్టు ప్రచారం జరుగుతోంది. రాజధాని మార్పు విషయంలో ఆంధ్రప్రదేశ్‌లో నెలకొన్న అశాంతిని తొలగించడానికి కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని పవన్‌ కల్యాణ్‌ ఇప్పటికే బహిరంగంగా విజ్ఞప్తి చేశారు. అది కేంద్ర ప్రభుత్వ ధర్మం... బాధ్యతని రైతులను కలిసిన సందర్భంలో వ్యాఖ్యానించారు. 

అందుకు తగ్గట్టుగానే.. పార్టీ కార్యాలయంలో ముఖ్య నేతలతో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసి కేంద్రం దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలపై చర్చించారు. అనంతరం.. కేంద్ర పెద్దల నుంచి పిలుపు రావడంతో పవన్ రెండు రోజుల క్రితం హుటాహుటిన ఢిల్లీ వెళ్లారు. నిన్న హైదరబాద్ తిరిగొచ్చారు. ఇక ఇవాళ కాకినాడలో పర్యటించనున్నారు జనసేనాని పవన్ కళ్యాణ్‌. విశాఖ నుంచి నేరుగా కాకినాడ వెళ్లనున్నారు జనసేనాని. నడ్డాతో చర్చల్లో పొత్తుపై పవన్ అంగీకరించినట్టు తెలుస్తోంది. భవిష్యత్ ఎన్నికల్లో బీజేపీతో కలిసి పోటీ చేయాలని జనసేన నిర్ణయించినట్టు ఆ పార్టీ వర్గాలు అంటున్నాయి. ఏపీలో ప్రజాసమస్యలపై కలిసి పోరాడాలని బీజేపీ, జనసేన నిర్ణయించినట్టు, వచ్చే ఎన్నికల్లో బీజేపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశం ఉందని చెబుతున్నాయి.

More Related Stories