English   

మహేష్ ని రెచ్చగొడుతున్న బన్నీ...పెద్ద రచ్చే 

Mahesh Babu
2020-01-14 14:23:12

తెలుగు ప్రజలను రెండు రోజుల ముందుగానే తెలుగు సినిమా క్రాంతి పలకరించేసింది. మహేష్ బాబు 'సరిలేరు నీకెవ్వరు' అంటూ 11న థియేటర్స్ లో పలకరించగా 12న వైకుంఠపురంలో అంటూ అల్లు అర్జున్ ప్రేక్షకుల ముందుకు వచ్చేశారు. రెండూ ప్రత్యేకమైన సినిమాలే. సరిలేరు నీకెవ్వరు కేవలం 5 నెలలో మహేష్ కెరీర్ లోనే అత్యంత వేగంగా రూపుదిద్దుకున్న సినిమా కాగా అల వైకుంఠపురములో దాదాపు ఏడాదిన్నర గ్యాప్ తరువాత అల్లు అర్జున్ చేసిన సినిమా. 

రెండూ వేర్వేరు జానర్ సినిమాలు. కానీ, ఒకే సారి విడుదల కోసం పోటీ పడ్డ సినిమాలు కావడంతో ఈ రెండు సినిమాల్లో ఏది సంక్రాంతి సినిమా అనే దాని మీద చర్చలు జరుగుతున్నాయి. అయితే రెండు సినిమాలకి మంచి టాక్ వచ్చింది. అయితే ఇప్పుడు ఈ రెండు సినిమాల్లో గాను సంక్రాంతి విన్నర్ తమ సినిమానేనంటూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది 'అల వైకుంఠపురములో` చిత్ర యూనిట్. అయితే ఇలా ఒకటి రెండు రోజులకే సంక్రాంతి విన్నర్ మేమే అంటూ పోస్టర్‌ను విడుదల చేయడంతో మహేష్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. 

మా అభిమాన హీరోను, ఆయన అభిమానులను కావాలనే రెచ్చగొట్టేలా ఈ పోస్టర్ ఉందని అంటూ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో మండిపడుతున్నారు. సంక్రాంతి విన్నర్ అని ఎవరు చెప్పారు..అంతకు ముందు రోజే వచ్చిన మా సినిమాకి కూడా హిట్ టాక్ వచ్చింది. మేము వేసుకోలేకనా అలా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఒకరకంగా సోషల్ మీడియాలో దీని పై పెద్ద చర్చే జరుగుతోంది. మరి బన్నీ ఇలా రెచ్చగొట్టే ప్రోగ్రామ్స్ ఎందుకు పెట్టుకున్నాడో ఆయనకే తెలియాలి.

More Related Stories