English   

టీవీలో దర్బార్ సినిమా...షాక్ లో నిర్మాతలు !

darbar
2020-01-14 19:07:54

రజినీకాంత్ హీరోగా మురుగదాస్ తెరకెక్కించిన మోవీ దర్బార్‌. సంక్రాంతి కానుకగా జనవరి 9న విడుదలైన ఈ సినిమా తెలుగులో అంతగా  ఆకట్టుకోకపోయినా కూడా తమిళనాట మంచి వసూళ్లని రాబడుతోంది. మొదటి వీక్ కి ఈ సినిమా 150 కోట్ల గ్రాస్ వసూలు చేసిందని పోస్టర్స్ కూడా విడుదల చేశారు దర్శక నిర్మాతలు. వారు ఆ సంతోషంలో ఉంటే విడుదలైన నాలుగు రోజుల్లోనే టీవీలో ప్రసారమై మేకర్స్ కి షాక్ ఇచ్చింది ఈ సినిమా. అదేంట్రా బాబు అనుకుంటున్నారా దానంతట అదేమీ ప్రసారం కాలేదు. దానిని కావాలనే పైరసీని ప్రసారం చేసారు. మొదట ఈ సినిమా HD ప్రింట్‌ లింక్ ను వాట్సాప్‌ గ్రూపుల్లో షేర్‌ చేశారు. ఆ లింక్ ద్వారా సినిమా డౌన్లోడ్ చేసిన ఒక చానల్ ఏకంగా ఆ సినిమాని ప్రసారం చేసేసింది. శరణ్య టీవీ అనే లోకల్ ఛానెల్‌ అక్రమంగా దర్బార్ సినిమా పైరసీ వెర్షన్‌ను మధురైలో జనవరి 12న ప్రసారం చేసినత్తి నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ దృష్టికి వచ్చింది. విషయం తెలుసుకున్న తర్వాత చాలా సీరియస్ అయిన లైకా సంస్థ.. వెంటనే ఆ టీవీ ఛానెల్‌పై కేసు నమోదు చేశారు. సినిమా విడుదల అయి నాలుగు రోజులు కూడా గడవక ముందే టీవీలో ఎలా ప్రసారం చేస్తారని? తమిళ చిత్ర పరిశ్రమకు నష్టం చేకూరుస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో లైకా సంస్థ కోరింది. 

More Related Stories