రోజుకొక పార్టీతో సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న మహేష్

సూపర్‌స్టార్ మహేష్ బాబు హీరోగా డైరెక్టర్ అనిల్ రావిపూడి తెరకెక్కించిన తాజా మూవీ సరిలేరు నీకెవ్వరు. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 11న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా మంచి పాజిటివ్ టాక్ అందుకుంది. దీంతో సినిమా భారీ కలెక్షన్లతో దూసుకుపోతోంది. ఈ నేపధ్యంలో మహేష్ రోజుకొక పార్టీ చేసుకుంటున్నారు. చిత్రం సక్సెస్ టాక్‌తో దూసుకెళుతున్న క్రమంలో రిలీజ్ రోజు రాత్రి సరిలేరు నీకెవ్వరు టీం బ్లాక్ బస్టర్ పార్టీ జరుపుకుంది. ఈ పార్టీలో మహేష్, నమ్రత, అనీల్ రావిపూడి, దేవి శ్రీ ప్రసాద్, అనీల్ సుంకర, సంగీత, రష్మిక, రాజేంద్ర ప్రసాద్, సితార తదితరులు పాల్గొన్నారు. మహేష్ తన ట్విట్టర్లో గ్రూప్ ఫోటో షేర్ చేస్తూ బ్లాక్ బస్టర్ పార్టీ, సెలబ్రేషన్ బిగిన్స్ అని ట్వీట్ చేశారు. ఇక తాజగానిన్న్న కూడా మళ్ళీ యూనిట్ మొత్తానికి మహేష్ గ్రాండ్ పార్టీ ఇచ్చారు. ఈ పార్టీలో దర్శకుడు అనిల్ రావిపూడి, దిల్ రాజు, దేవీశ్రీప్రసాద్, రష్మిక, దర్శకుడు వంశీ పైడిపల్లి, నమ్రత, అనిల్ సుంకర తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తీసుకున్న సెల్ఫీని మహేష్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. 'బ్లాక్ బస్టర్ పార్టీ కంటిన్యూస్.. సరిలేరు నీకెవ్వరు' అంటూ తన ఆనందాన్ని పంచుకున్నారు.