English   

మెగా అల్లుళ్ళకి పవర్ స్టార్ విషెస్

pk
2020-01-14 20:37:23

మెగా హీరోలు అల్లు అర్జున్, సాయి ధరమ్ తేజ్‌‌ లు ఇద్దరూ మంచి జోష్‌లో ఉన్నారు. ఎందుకంటే వారి వారి సినిమాలి ఇచ్చిన హిట్ జోష్ అది. అయితే అక్కడితో వారి జోష్ ఆగలేదు ఎందుకంటే ఈ ఇద్దరికి ఇప్పుడు అభినందనలు తెలిపారు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్. వీరితో పాటు డైరక్టర్, ప్రొడ్యూసర్, సినిమా బృందాలకు ఆయన తన అభినందనలు తెలిపారు. సుప్రిమ్ హీరో సాయి ధరమ్ తేజ్ నటించిన ప్రతిరోజూ పండగే మూవీ గత ఏడాది డిసెంబర్ నెలలో ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. అలాగే త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన అల..వైకుంఠపురంలో మూవీ కూడా గ్రాండ్ సక్సెస్ అయిన విషయం తెలిసిందే. ఈసందర్భంగా ఇద్దరికి పూల బోకేను పంపి విషెస్ తెలియజేశారు పవన్. 'అల్లు అర్జున్ గారు అల వైకుంఠపురములో సినిమా మంచి విజయాన్ని అందుకుంటున్నందుకు కంగ్రాట్స్. ఫ్యూచర్ ప్రాజెక్ట్‌లకు ఆల్ ది బెస్ట్'' అని కామెంట్ పెట్టారు. అలాగే  ప్రతిరోజు పండగే విజయాన్ని గుర్తు చేస్తూ సాయి ధరమ్ తేజ్‌కు బొకేను పంపారు పవన్. మామ అభినందనలు తెలపడంతో ఆనందం వ్యక్తం చేశారు బన్ని, సాయి తేజ్. అయితే ఇక్కడ కొసమెరుపు ఏంటంటే వీరిద్దరికీ వయసులో చాలా పెద్దవాడయిన పవన్ వీరిద్దరినీ గారు అని సంబోధించడం. అది కూడా పవన్ ఫ్యాన్స్ గొప్పగా చెప్పేసుకుంటున్నారు.

More Related Stories