English   

నితిన్ పెళ్లి ఏప్రిల్ లో..పెళ్లి కూతురు ఎవరంటే...

Nithin.jpg
2020-01-14 22:48:05

టాలీవుడ్‌లో మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్స్‌ లిస్ట్‌లో ఉన్న హీరోలలో నితిన్‌ ఒకరు. ఇండస్ట్రీకి వచ్చిన 17 ఏళ్లు అవుతున్నా ఈ యంగ్ హీరో పెళ్లి ఊసే ఎత్తటం లేదు. గతంలో చాలా సార్లు నితిన్ పెళ్లిపై వార్తలు వినిపించినా ఆ వార్తలు అన్నీ పుకార్లుగానే తేలిపోయాయి. తాజాగా మరోసారి ఇదే వార్త తెర మీదకు వచ్చింది. యంగ్ హీరో నితిన్‌ ఫైనల్‌గా పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నాడని, నితిన్‌ పెళ్లాడబోయే అమ్మాయి  లండన్‌లో ఎంబీఏ చదివిన షాలిని అని తెలుస్తోంది.

ఏకంగా నాలుగున్నరేళ్ళగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారన్న వార్త ఇప్పుడు టాలీవుడ్ లో హాట్‌ టాపిక్‌గా మారింది. త్వరలో అత్యంత సన్నిహితులు, కుటుంబ సభ్యుల మధ్య వీరి నిశ్చితార్థ వేడుకను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే ఈ ఏడాది ఏప్రిల్‌ పెళ్లి చేసుకునేందుకు నితిన్‌ ఓకే చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ వార్తలపై నితిన్‌ కుటుంబ సభ్యుల నుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు. కానీ నితిన్ తన పెళ్లిని డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ తరహాలో చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడట.

ఏప్రిల్‌లో దుబాయ్‌లో ఈ పెళ్లి వేడుక జరగనుందని తెలుస్తోంది. దుబాయ్‌లోని ప్యాలసో వెర్సేస్‌ హోటల్‌లో వీరి వివాహం జరగనుందని తెలుస్తోంది. ఏప్రిల్‌ 15, 16 తేదిల్లో ఈ వేడుకను నిర్వహించనున్నారన్న ప్రచారం అయితే జరుగుతోంది. ప్రస్తుతం నితిన్‌ చేతి నిండా సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నాడు. లాంగ్ బ్రేక్‌ తీసుకుని ఏడాది పాటు అంజన్న మల వేసుకున్న నితిన్‌ తరువాత వరుసగా సినిమాలు అంగీకరించాడు.

ఇప్పటికే వెంకీ కుడుముల దర్శకత్వంలో భీష్మ సినిమా రిలీజ్ కి రెడీ కాగా, రంగ్‌దే, చంద్రశేఖర్‌ ఏలేటి, కృష్ణ చైతన్యల దర్శకత్వంలో కూడా సినిమాలు చేసేందుకు అంగీకరించాడు.

More Related Stories