English   

సుక్కూ మహేష్ మధ్య గ్యాప్...ఇదిగో సాక్ష్యం

mb
2020-01-15 05:22:25

‘మహర్షి’ సినిమా తర్వాత మహేష్ బాబు నిజానికి సుకుమార్ దర్శకత్వంలో సినిమా చేయాల్సింది. కానీ ఈ సినిమా ఎందుకో కానీ ఆగిపోయింది. సినిమా ప్రకటించిన తర్వాత అది క్యాన్సిల్ అయింది. మహేష్ - సుకుమార్ మధ్య క్రియేటివ్ డిఫరెన్సుల కారణంగా ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదని మహేషే ప్రకటించాడు. ఆ సమయంలో మహేష్ - సుకుమార్ కు మధ్య గ్యాప్ వచ్చిందని అన్నారు. అయితే అది నిజమని ఇప్పుడే అనిపిస్తోంది. ఎందుకంటే ‘సరిలేరు..’ చేయాలనుకోవడం తన కెరీర్లోనే బెస్ట్ డెసిషన్ అని మహేష్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్టేట్మెంట్ ఇవ్వడం ఈ వ్యవహారాన్ని మళ్ళీ ఈ గ్యాప్ అంశం తెర మీదకు వచ్చింది. ఈ ఏడాది సంక్రాంతి బరిలో మహేష్, బన్నీ ఇద్దరు పోటీగా సినిమాలు రిలీజ్ చేశారు. మహేష్ సరిలేరు నీకెవ్వరు, అల్లు అర్జున్ అల వైకుంఠపురములో చిత్రాలతో ఒకరోజు గ్యాప్‌తో ప్రేక్షకుల ముందుకు రాగా రెండు సినిమాలను ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. అయితే తాజాగా సుకుమార్ అల వైకుంఠపురములో సినిమాను గురించి సోషల్ మీడియాలో స్పందించారు. సినిమా చాలా బావుందంటూ టీమ్ కి కితాబిచ్చారు. ఈ సందర్భంగా బన్నీతో దిగిన ఒక పిక్ కూడా షేర్ చేశారు. ఇక్కడిదాకా బానే ఉంది కానీ సుకుమార్ మరో సంక్రాంతి సినిమా 'సరిలేరు నీకెవ్వరు' పై స్పందించకపోవడం చర్చనీయాంశం అయింది.  ఇప్పుడు 'సరిలేరు నీకెవ్వరు' పై సుక్కు స్పందించకపోవడం చూస్తుంటే ఇంకా ఆ గ్యాప్ కొనసాగుతోందని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.  మరి మహేష్ బాబు సినిమాను సుకుమార్ చూడలేదు కాబట్టి స్పందించలేదా లేక ఇంకా ఇద్దరి మధ్య అదే గ్యాప్ కొనసాగుతోందా అనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే సరిలేరుకు సుకుమార్ బెస్ట్ ఫ్రెండ్స్ అయిన దేవీ శ్రీ ప్రసాద్, రత్నవేలు పనిచేశారు. మహేష్ కోసం కాకపోయినా వారి కోసం అయినా సినిమా మీద కామెంట్ చేస్తారని కొంచెం ఆగాలని కూడా సుకుమార్ ని అభిమానించే నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఏమో లోగుట్టు పెరుమాళ్ళకెరుక!

More Related Stories