English   

బన్నీ, మహేష్ సినిమాల ఎంట్రీతో మారిన టాప్ టెన్ మూవీస్ ఫస్ట్ డే కలెక్షన్స్...

Top 10 Movies Collections.jpg
2020-01-15 06:55:40

టాలీవుడ్ మార్కెట్ పెరిగింది. ఒకప్పుడు వంద రోజులు ఎక్కువ థియేటర్స్ లో సినిమా ఆడితే హిట్ అనుకునే వాళ్ళు కానీ ఇప్పుడు లెక్క మారింది. సినిమా రిలీజ్ అయి ఒక వారం పదిరోజుల్లో ఎంత ఎక్కువ కలెక్ట్ చేస్తే ఆ సినిమా అంత పెద్ద హిట్ అనే లెక్క వచ్చేసింది. ఇక మన ఇండస్ట్రీ హాలీవుడ్, బాలీవుడ్ తర్వాత భారీ బడ్జెట్ సినిమాలు నిర్మించే రేంజ్ కి వెళ్ళిపోయింది.

బడ్జెట్ పెడుతున్నారు కాబట్టి వాటిని మిగతా బాషలలో కూడా రిలీజ్ చేస్తున్నారు అనుకోండి అది వేరే విషయం. నిజానికి తెలుగు సినిమా చరిత్ర గురించి మాట్లాడితే బిఫోర్ బాహుబలి ఆఫ్టర్ బాహుబలి అనాలేమో ఎందుకంటే అంతలా తెలుగు సినిమా మార్కెట్ ని కీర్తిని మార్చేసింది ఆ సినిమా. ఇక తెలుగులో ఈ సంక్రాంతికి రెండు పెద్ద సినిమాలు రిలీజ్ అయ్యాయి. వాటితో తెలుగులో టాప్ టెన్ ఫస్ట్ డే కలెక్షన్స్ లిస్ట్ మారింది. ఆ లిస్ట్ ఒక సారి పరిశీలిద్దామా
1. బాహుబలి 2 42.76 కోట్లు
2. సై రా నరసింహారెడ్డి 38.26 కోట్లు
3. సాహో 35.36 కోట్లు
4. సరిలేరు నీకెవ్వరూ 32.01 కోట్లు
5. అల వైకుంఠపురములో 26.76 కోట్లు
6. అరవింద సామెత 26.64 కోట్లు
7. అజ్ఞాతవాసి 26.39 కోట్లు
8. వినయ విధేయ రామ 26.07 కోట్లు
9. ఖైదీ నెంబర్ 150 25.05 కోట్లు
10.మహర్షి 24.14 కోట్లు
అయితే ఈ లిస్ట్ లో సాహో, సైరా, అజ్ఞాతవాసి, వినయ విధేయ రామ సినిమాలకి మొదటి షో నుండే డివైడ్ టాక్ వచ్చింది, కానీ సినిమాల మీద ఉన్న క్రేజ్ తో ఆ సినిమాలు కూడా ఈ లిస్ట్ లో స్థానం సంపాదించాయి.

More Related Stories