మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు...రెమ్యూనరేషన్ అన్ని కోట్లా...

సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ అయిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా సరిలేరు నీకెవ్వరు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో చాలా కాలం తర్వాత విజయశాంతి తెరపై మళ్లీ మెరిసారు. సినిమాకు హిట్ టాక్ రావటంతో ఈ సినిమాలో ఎవరి రెమ్యూనరేషన్ ఎంత అనే విషయం మీద రకరకాల ప్రచారాలు మొదలయ్యాయి. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు తీసుకున్న రెమ్యూనరేషన్ గురించి రకరకాల ప్రచారాలు జరుగుతున్నాయి.
మహర్షి సినిమాకు గాను 20కోట్లకు పైగా చార్జ్ చేసిన మహేష్‌బాబు ఈ సినిమా ద్వారా 50 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకున్నాడని ప్రచారం సాగుతోంది. ఈ సినిమా నాన్ థియరేటికల్ రైట్స్ మహేష్ తీసుకోవడంతో వాటి వోర్త్ ఆయన తీసుకున్నట్టు అయ్యింది. ఆ రైట్స్ మాత్రమే 49కోట్ల వరకు ఉంటుందని ప్రచారం సాగుతోంది. అయితే ఈ రెమ్యూనరేషన్ మీద ఈ సినిమా సహ నిర్మాతగా వ్యవహరిస్తున్న అనిల్ సుంకర స్పందించారు. ‘‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం కోసం ఇప్పటివరకు మహేశ్‌కి ఒక్కరూపాయి కూడా ఇవ్వలేదు. ఆయన రూ.50 కోట్లు పారితోషికం తీసుకున్నారంటూ వస్తున్న వార్తలు అవాస్తవం.
ఈ సినిమా నిర్మాణంలో మహేష్ కి కూడా పార్టనర్ షిప్ ఉంది. సినిమా విడుదలై బాక్సాఫీస్ వద్ద వచ్చే కలెక్షన్స్ ని బట్టి మహేష్ తన వాటా తీసుకుంటారు’ అని అనిల్ తెలిపారు. ఇక ప్రతి సినిమా పూర్తి కాగానే ఫారెన్ చేక్కేసే మహేష్ మళ్ళీ ట్రిప్ వేయడానికి రెడీగానే ఉన్నాడట. వచ్చే వారం లాంగ్ హాలిడే ట్రిప్ కు బయలుదేరబోతున్నట్టు విశ్వసనీయ వర్గాల నుండి అందుతున్న సమాచారం.