English   

అసలు వైకుంఠపురము ఇల్లు ఎవరిదో తెలుసా

ala
2020-01-15 18:23:18

దర్శకుడు త్రివిక్రమ్ సినిమాల్లో ఇళ్లు, వాకిళ్లు అన్నీ ఓ రేంజ్ లో ఉంటాయి. అది మిడిల్ క్లాస్ ఇల్లయినా, రిచ్ హవుస్ అయినా ఒక రేంజ్ లో చూపిస్తాడు. అత్తారింటికి దారేది, అఆ సినిమాల్లో ఇల్లు చూస్తే అది మీకే అర్ధం అవుతుంది. ఇక తాజాగా త్రివిక్రమ్ అల్లు అర్జున్ తో తీసిన సినిమాలో ఉండే ఇల్లు గురించి ఆసక్తికర అంశం వెలుగులోకి వచ్చింది. అదేంటంటే తెలుగులో లీడింగ్ న్యూస్ ఛానెల్ అధినేత కుమార్తె అత్తగారింటిని ఈ సినిమా కోసం వాడారట. అది ఎవరో కాదు ఎన్టీవీ చైర్మన్ నరేంద్ర చౌదరి వియ్యంకుడు సబ్బినేని సురేంద్రకు  హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో నగరంలోనే అత్యంత ఖరీదైన ఇల్లు ఉంది. సుమారు రూ. 300 కోట్ల విలువచేసే ఆ ఇల్లు అత్యంత విలాసంగా ఉంటుందట. ఎంతలా అంటే ఆ ఇంటి గార్డెన్ లో పూసే పూలకు కూడా పేటెంట్ ఉంటుంది అంటే మీరు నమ్మక పోవచ్చు. ఇటలీ నుంచి తెప్పించిన విలువైన మొక్కలు ఎన్నో ఆ ఇంట్లో ఉన్నాయి. ఓ సారి ఆ ఇంటిని అనుకోకుండా చూసిన త్రివిక్రమ్ తన కథకు సరిగ్గా సరిపోయే ఇల్లు దొరికిందని సంతోషించారు. వెంటనే ఆ ఇంటి యజమానులతో మాట్లాడగా వారు కూడా ఒప్పుకున్నారు. అలా ఇప్పుడు ఆ ఇల్లు వైకుంఠపురముగా మారి సినిమాలోనే కీలకంగా నిలిచింది. సుమారు 20 రోజుల పాటు ఆ ఇంట్లో సినిమా షూట్ చేశారు. అయితే ఆ ఇంటిని చూసిన బన్నీకి కూడా విలాసవంతమైన ఇల్లు కట్టుకోవాలని నిర్ణయించుకున్నాడు. ఇంటికి సంబంధించిన పలు విషయాలను యజమానులను అడిగి తెలుసుకున్నాడు. అదే స్థాయిలో బంజారాహిల్స్ లో ఇంటిని నిర్మించుకోబోతున్నాడట అల్లు అర్జున్ . అంతే కాదండోయ్ తన కొత్తింటి విషయాన్ని ఇటీవల అల వైకుంఠపురము థ్యాంక్స్ మీట్ లో వెల్లడించిన బన్నీ ఆ ఇంటి నిర్మాణానికి నిర్మాత, తన తండ్రి అల్లు అరవింద్ ను డబ్బులు అడుగుతానని చెప్పడం విశేషం. 

More Related Stories