English   

ఫైటర్ అప్డేట్...షూటింగ్ ఆరోజు నుండే

vij
2020-01-15 19:01:17

యువ కథానాయకుడు విజయ్ దేవరకొండ ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో ‘వరల్డ్ ఫేమస్ లవర్’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా తర్వాత పూరీ-విజయ్ కాంబినేషన్లో ఫైటర్  సినిమా మొదలు కాబోతోంది. ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపించనున్నాడని ప్రచారం జరుగుతుండగా ఈ సినిమా ద్వారా బాలీవుడ్ హీరోయిన్ జాన్వీ కపూర్ కథానాయిక గా టాలీవుడ్ కు పరిచయం అవబోతోందని కూడా ప్రచారం జరిగింది. అయితే హీరోయిన్ సంగతేమో తెలీదు కానీ తాజాగా ఈ సినిమా షూటింగ్ అప్ డేట్ మాత్రం ఇచ్చింది యూనిట్. నిర్మాత ఛార్మీ విడుదల చేసిన ఒక వీడియో ప్రకారం జనవరి 20 నుండి ముంబైలో ‘ఫైటర్’ రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుంది. వీడియోలో ఆమె వెనక ఉన్న ఒక బాక్సింగ్ రింగ్ లో విజయ్ దేవరకొండ మార్షల్ ఆర్ట్స్ ట్రైనింగ్ లో ఉన్నాడు. ఈ ట్రైనింగ్ అంతా థాయిలాండ్ లో జరుగుతోందట. ఈ సినిమా కోసమే విజయ్‌ మార్షల్‌ ఆర్ట్స్ లో మెళకువలు నేర్చుకుంటున్నాడు. ఈ సినిమాని ప్యాన్ ఇండియా లెవల్ లో విడుదల చేయనున్నారని అంటున్నారు. ఫైట్ మాస్టర్ కిచ్చా పర్యవేక్షణలో15 మంది ఫైటర్ల బృందం రోజుకు 6 నుంచి 8 గంటలు విజయ్ కి రకరకాల మార్షల్ ఆర్ట్స్ లో శిక్షణ ఇస్తున్నారు. ఏ సినిమాలో చూడని విధంగా తమ సినిమాలో సరికొత్త తరహాలో ఫైట్స్ ఉంటాయని ఛార్మి, కిచ్చా వెల్లడించారు. ఈ సినిమాని పూరీ కనెక్ట్స్ బ్యానర్ మీద చార్మి, పూరీతో కలసి కరణ్ జోహార్ నిర్మిస్తున్నారు.

 

More Related Stories