English   

హృతిక్ రోషన్ మతి పోగొట్టిన డ్యాన్సర్

hruthik
2020-01-15 21:04:25

డ్యాన్స్‌ అనగానే ప్రతీ ఒక్కరి మదిలో మెదిలే వ్యక్తి మైకెల్ జాక్సన్. స్ర్పింగ్‌లా ఎగురుతూ స్టెప్పులు ఇరగదీసే అతనంటే పడిచచ్చేవాళ్లు ఎంతోమంది. అయితే, మన ఇండియాలోనూ ఎంతోమంది మైకెల్ జాక్సన్‌లున్నారు. ఇప్పటికే కొందరు తామేంటో నిరూపించుకోగా, మరికొందరు జాక్సన్‌లు వెలుగులోకి వస్తున్నారు.వరల్డ్ వైడ్ ఫేమస్ డ్యాన్సర్ మైకెల్ జాక్సన్. బాడీ మొత్తం బెండ్ చేస్తూ ఆయన వేసే స్టెప్పులు ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తాయి. ఆయన్ను చూసి ఎంతోమంది డ్యాన్సర్లు అయినవాళ్లు ఉన్నారంటే జాక్సన్ ఎంత ఫేమస్ డ్యాన్సరో అర్థమవుతుంది.

హాలీవుడే కాదు,  ఇండియాలోని అన్ని వుడ్‌లలో ప్రముఖ డ్యాన్సర్లున్నారు. అందులో మనం ముందుగా చెప్పుకోవాల్సి వస్తే, కొందరు స్పెషల్. జాక్సన్ మాదిరి బాడీలో నరనరాలు పదనిసలు ఆడించే డ్యాన్సర్లలో ప్రభుదేవా ఒకరు. డిఫరెంట్ స్టెప్పులతో ఎప్పటికప్పుడు కొత్తదనం చూపిస్తూ, ఆడియన్స్‌ను మైమరపిస్తుంటారు ప్రభుదేవా. బాలీవుడ్‌ స్టార్ హీరో హృతిక్ రోషన్ డ్యాన్స్‌ ఇరగదీస్తాడని మనందరికే తెలిసిందే. హృతిక్ సినిమా రిలీజ్ అవుతుందంటే,  కేవలం ఆయన డ్యాన్స్‌ చూసేందుకే ఎంతోమంది థియేటర్‌కు వెళ్తుంటారు. అలాంటి డ్యాన్సర్ల మతులు పోగొడుతూ మరో యువకెరటం వెలుగులోకి వచ్చాడు.   ఓ టిక్ టాక్ యూజర్ చేసిన డ్యాన్సింగ్ వీడియో సోషల్ మీడియాలో ఊపేస్తోంది. కుర్రాడి స్టెప్పులు చూసి హృతిక్ రోషన్ ఫిదా అయిపోయాడు.  ఎయిర్‌వాకర్ స్టైల్లో పాదాలను చకచకా కదుపుతూ గాల్లో తేలిపోయినట్లుగా స్టెప్పులతో దుమ్ముదులిపేశాడు.  ఈ వీడియో నెట్టింట ఫుల్ వైరల్ అవుతోంది. ఆ యువకుడి నాట్యానికి ప్రతి ఒక్కరూ మంత్రముగ్దులవుతున్నారు.

More Related Stories