English   

తాంబూలాలిచ్చేశాను తన్నుకు చావండి.....బన్నీ, మహేష్ ల కలెక్షన్స్ రచ్చ

Ala Vaikuntapuram Vs Sarileru Nekevvaru.jpg
2020-01-15 21:51:36

సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌ల మధ్య సంక్రాంతి యుద్ధం ఇప్పట్లో ముగిసేలా కనిపించడం లేదు, మహేష్ బాబు నటించిన ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం జనవరి 11న విడుదల కాగా.. అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో’ జనవరి 12 విడులైంది. అయితే రెండు చిత్రాలకు హిట్ టాక్ రావడంతో ఇప్పుడు కలెక్షన్స్ ని పోటాపోటీగా ప్రకటించుకుంటున్నారు. మునుపెన్నడూ తెలుగు సినిమా చరిత్రలో లేని విధంగా కలెక్షన్స్ పోస్టర్స్‌ను విడుదల చేస్తూ ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియా వార్‌ కి తెర లేపారు ఈ రెండు సినిమాల మేకర్స్.

ముందుగా అల్లు అర్జున్ సంక్రాంతి విన్నర్ నేనే అంటూ రూ.85 కోట్లు గ్రాస్‌తో పోస్టర్ వదిలారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో రూ.29.45 షేర్ వసూలు చేసినట్టు తెలిపారు. నైజాం - రూ. 6.80 కోట్లు, సీడెడ్ - రూ. 4.02 కోట్లు, ఉత్తరాంధ్ర - రూ. 2.87 కోట్లు, తూర్పుగోదావరి - రూ. 3.54 కోట్లు, పశ్చిమ గోదావరి - రూ. 2.78 కోట్లు, గుంటూరు - రూ. 5.11 కోట్లు, కృష్ణా - రూ. 3.10 కోట్లు, నెల్లూరు - రూ. 1.32 కోట్లు వసూలైనట్టు లెక్కలు రిలీజ్ చేశారు. ఇక ముందు 46 కోట్లు షేర్ అంటూ బ్లాక్ బస్టర్ గా బాప్ అంటూ పోస్టర్ రిలీజ్ చేసిన మహేష్ టీం ఇప్పుడు బన్నీని చూసి రకరకాల పోస్టర్స్ వదిలారు. మూడు రోజునాటికి 103 కోట్ల గ్రాస్ సాధించినట్టుగా ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రయూనిట్ బ్లాక్ బస్టర్ కా బాప్ పోస్టర్‌ను నిన్నవిడుదల చేశారు.

ఈ పోస్టర్‌లో రియల్ కలెక్షన్స్ అంటూ మెన్షన్ చేయడమే ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చకి ఒక కారణం అయింది. మా హీరో సినిమాకి ఎక్కువ కలెక్షన్స్ వచ్చాయంటే మా హీరోకి వచ్చాయని ఇద్దరి అభిమానులు ఒకరిపై ఒకరు తిట్టుకు చస్తున్నారు. ‘అల వైకుంఠపురములో’ చిత్ర యూనిట్ సంక్రాంతి విన్నర్ అంటూ వరుస పోస్టర్స్, ప్రోమోలను విడుదల చేస్తుంటే.. బాక్సాఫీస్ కా బాప్ అంటూ కౌంటర్ ప్రోమోలను విడుదల చేస్తున్నారు ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర యూనిట్.  చూడాలి ఈ వ్యవహారం ఇంతదాకా వెళుతుంది అనేది ?

More Related Stories