English   

రష్మిక మందన్నకి షాక్.. పండగ పూట ఐటీ దాడులు..

 Rashmika Mandanna
2020-01-16 13:03:33

మొన్న సంక్రాంతికి సరిలేరు నీకెవ్వరు సినిమాతో ప్రేక్షకులను పలకరించి ఆ సినిమాతో తన ఖాతాలో హిట్ వేసుకున్న రష్మిక మందన్నాకి ఐటీ అధికారులు షాక్ ఇచ్చారు. కర్ణాటక రాష్ట్రం కొడగు జిల్లాలోని విరాజ్‌పేటలోని కుక్లూర్‌లోని ఆమె నివాసం పై ఐటీ అధికారులు దాడి చేశారు.  2016 లో సినీరంగ ప్రవేశం చేసిన ఆమె కన్నడలో కిరాక్ పార్టీ, అంజని పుత్రా, చమక్, తెలుగు గీత గోవిందం, దేవదాస్, డియర్ కామ్రేడ్, మొన్నటి సరిలేరు నీకెవ్వరు, భీష్మ సినిమాలలో రష్మిక మందన్న నటించింది. ఆమె నివాసం మీద ప్రస్తుతం 10 మందికి పైగా అధికారులు సోదాలు చేస్తున్నారు. ఈ ఉదయం 7.30 నుండి ఐటి అధికారులు ఆమె ఇంట్లో డాక్యుమెంట్స్ చెక్ చేస్తున్నట్టు చెబుతున్నారు. ఆమె తన రెమ్యునరేషన్ గురించి తప్పుడు లెక్కలు సమర్పించి ఉండవచ్చని, అలాగే ఆమె ఒక సినిమాని  టాలీవుడ్‌లో నిర్మిస్తున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయని కన్నడ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఈ కారణాల వల్ల ఐటీ అధికారుల దాడి జరిగి ఉండవచ్చని ప్రచారం జరుగుతోంది. దీని మీద పూర్తి సమాచారం అందాల్సి ఉంది.

More Related Stories