English   

టాలీవుడ్ లో సంచలనంగా మారిన ఎఫైర్...వారిద్దరి మధ్యేనా 

Tollywood
2020-01-16 13:14:03

సినిమా ఇండస్ట్రీ అంటే అఫైర్స్ ఉండడం కొత్తేమీ కాదు. ఒక్క తెలుగు మాత్రమే కాక అన్ని బాషలలో ఇదు మామూలే. అయితే అఫైర్స్ ఉన్నా లేకున్నా ఏదో ఒక పుకారు తరచూ వస్తూ ఉంటుంది కాబట్టి ఇలాంటి విషయాలు బయటకు నిజంగానే వచ్చినా ఎవరూ నమ్మరు. ఏదో గాసిప్ అయ్యి ఉంటుందిలే అని లైట్ తీసుకుంటారు. 

అయితే తాజాగా మన టాలీవుడ్ కి సంబందించిన ఒక హీరో గురించి రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. సంక్రాంతికి సినిమా రిలీజ్ చేసి మంచి రంజుగా ఉన్న ఆ హీరో తన కో యాక్టర్ తో అఫైర్ పెట్టుకున్నారనే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో తెగ హల్చల్ చేస్తోంది. మొన్న సంక్రాంతికి రిలీజయిన సినిమా షూట్ కోసం ఫారెన్ వెళ్ళినప్పుడు ఆమెతో చెట్టాపట్టాలేసుకొని తిరగడం పెద్ద చర్చనీయాంశం అయిందట.

 అయితే సదరు హీరోగారికి ఇంతకు ముందే పెళ్లి అయి ఉండడంతో విషయం హోం మినిస్టర్ అదే నండీ ఆయన భార్య దాకా వెళ్లిందట. దీంతో ఆమె తన భర్త మీద తెగ ఫైర్ అయి ఆమెకు దూరంగా ఉంచే ప్రయత్నాలు చేసిందట. ఈ విషయం మీద ప్రచారం అయితే పెద్ద ఎత్తున జరుగుతుంది. కానీ ఇప్పటి దాకా ఆ హీరో గారి మీద కానీ సదరు హీరోయిన్ మీద కానీ ఇటువంటి వార్తలు పెద్దగా వచ్చింది లేదు. మరి అలాంటిది సడన్ గా ఇలా వార్తలు వచ్చాయంటే ఆలోచించాల్సిన విషయమే. 

ఎందుకంటే నిప్పు లేకుండా పొగ రాదు కదా. ఈ విషయం సోషల్ మీడియాలో కొంత మంది ట్రోల్ చేస్తుండడంతో పీఆర్ టీమ్స్ రంగంలోకి దిగాయి. సదరు హీరోయిన్ వేరే ఎవరితోనో ప్రేమలో పడినట్టు ఒకటి రెండు రోజుల నుండి ప్రచారం కూడా మొదలయింది. చూడాలి ఈ వ్యవహారం ఎంత త్వరగా క్లోజ్ చేస్తారో ?

More Related Stories