English   

హీరోయిన్ కి మూడు రెట్లు రెమ్యునరేషన్ అందుకున్న విజయశాంతి 

 Vijayashanti
2020-01-16 13:47:36

ఈ సంక్రాంతికి రిలీజయిన సినిమాల్లో మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు ఒకటి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మహేష్ ఆర్మీ రోల్ లో కనిపించి కనువిందు చేశారు. ఈ సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకుని కలెక్షన్స్ రికార్డ్స్ దిశగా పరిగెట్టుతోంది. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. ఇక ఈ సినిమాతో దాదాపుగా 13 ఏళ్ల తర్వాత రీఎంట్రీ ఇచ్చింది విజయశాంతి. 

ఈ సినిమాలో ఆమె ప్రొఫెసర్ భారతి అనే పాత్రలో కనిపించి తన నటనతో మంచి మార్కులు సంపాదించింది. అయితే ఈ సినిమాకి గాను ఆమె అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్నట్టుగా ఫిలం నగర్ లో ఓ వార్త సినిమా విడుదల ముందు నుండే హల్ చల్ చేస్తోంది. అయితే ఈ విషయం మీద ఇప్పుడు మరిన్ని వివరాలు తెలిశాయి. ఆ వివరాల ప్రకారం ఈ సినిమాకి గాను రష్మికకి నలభై ఐదు లక్షలు  రెమ్యునరేషన్ ఇవ్వగా, విజయశాంతికి కోటిన్నర ఇచ్చినట్టు చెబుతున్నారు. పెద్ద బ్యానర్, పెద్ద హీరో, కీలకమైన పాత్ర, రీ ఎంట్రీ సినిమా ఇలా అన్ని విషయాలని దృష్టిలో పెట్టుకుని ఆమె భారీ రెమ్యునరేషన్ ని డిమాండ్ చేసినట్టుగా తెలుస్తోంది.

నిజానికి అనిల్ త‌ను రాసుకున్న క‌థ‌కు విజ‌య‌శాంతి అయితేనే ప‌ర్ఫెక్ట్ ఛాయిస్ అని ఫిక్సైపోయి అడిగినంత పారితోషికం ఇప్పించారని తెలుస్తుంది. అసలు అయితే ముందుగా ఈ పాత్ర‌లో న‌టించ‌డానికి విజ‌య‌శాంతి 2.5 కోట్లు అడిగింద‌ని తెలుస్తుంది. చివ‌రికి 1.5 కోట్లకు బేరం తెగ్గొట్టార‌నే ప్ర‌చారం జ‌రుగుతుంది.  
 

More Related Stories