English   

ఆర్ఆర్ఆర్ గురించి ఆసక్తికర అప్డేట్..మరో స్టార్ హీరో కూడా 

RRR
2020-01-16 14:01:02

బాహుబలి సిరీస్ తో టాలీవుడ్‌ రేంజ్‌ని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లిన ఎస్‌ఎస్ రాజమౌళి తెరకేక్కిస్తోన్న తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. ఎవ్వరూ కనీసం గెస్ కూడా చేయలేని విధంగా టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఎన్టీఆర్, రామ్ చరణ్‌లతో మల్టిస్టారర్ గా తెరకెక్కిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ కొమ‌రం భీం పాత్ర‌లో నటిస్తుండగా, రామ్‌చ‌ర‌ణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నారు.

ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ నటి ఒలీవియా మోరిస్ నటిస్తుండగా, రామ్ చరణ్ సరసన బాలీవుడ్ భామ అలియా భట్ నటిస్తోంది. ఈ ఏడాది జూలై 30న విడుదల కానున్న ఈ సినిమా ఇప్పటివరకు 80 శాతం షూటింగ్‌ని పూర్తి చేసుకున్నట్టు చెబుతున్నారు. అయితే తాజాగా ఈ సినిమాకి సంబంధించి ఓ ఆసక్తికర అప్డేట్ ఒకటి సినీ వర్గాలలో చక్కర్లు కొడుతుంది.

అదేంటంటే ఈ సినిమాలో ఇప్పటికే సముద్రఖని, అజయ్ దేవగన్ లాంటి స్టార్స్ నటిస్తుండగా ఈ సినిమా కోసం మరో స్టార్ ని రోప్ చేసినట్టుగా చెబుతున్నారు. ఈ సినిమాలో కీలకమైన ఒక పోలీసాఫీసర్ పాత్ర కోసం కన్నడ స్టార్ హీరో సుదీప్ నటించనున్నట్టు చెబుతున్నారు. అయితే దీనిపై మాత్రం ఇంకా చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ అదే కనుక నిజమైతే మరో సారి తెలుగు ప్రేక్షకులను పలకరించనున్నాదన్న మాట.  

More Related Stories