అతడితో డేటింగ్ లో పూజా

తెలుగులో అత్యధిక పారితోషికం తీసుకుంటూ టాప్ హీరోయిన్ గా రాణిస్తోంది పూజా హెగ్డే. తాజాగా ఆమె 'అల వైకుంఠపురములో' చిత్రంతో వరుసగా ఐదు హిట్లు కొట్టి ఒక రికార్డు క్రియేట్ చేసుకుంది. సంక్రాంతి హిట్ తో ఆమె ఉబ్బితబ్బిబవుతోంది. అయితే అటువంటి తాజాగా పూజాకు సంబంధించిన ఒక వార్త హల్ చల్ చేస్తోంది.
ఈ సుందరి హిందీ నటుడు రోహన్ మెహ్రాతో పీకల్లోతు ప్రేమలో పడిందని బాలీవుడ్ వర్గాలలో విపరీతమైన ప్రచారం జరుగుతోంది. అంతేకాక వీరిద్దరూ చాలాకాలంగా డేటింగ్ చేస్తున్నారని టాక్ వినబడుతోంది. రోహన్ ఎవరో కాదు బాలీవుడ్ సీనియర్ స్టార్ వినోద్ మెహ్రా కుమారుడు. 2018లో వచ్చిన బజార్ సినిమాతో రోహన్ లైం లైట్ లోకి వచాడు. ఆ సినిమాలో పూజా కూడా నటించింది. ఆ సమయంలోనే ఈ జంట ప్రేమలో పడ్డట్టు సమాచారం.
ప్రస్తుతం పూజ, ప్రభాస్ నటిస్తున్న జాన్ మూవీలో అలాగే అఖిల్ అక్కినేనితో మరో మూవీలోను నటిస్తుంది. అయితే హీరో, హీరోయిన్లపై ఇలాంటి పుకార్లు రావడం సహజం. ఇందులో నిజం ఎంత ఉంది అనేది వేచి చూడాలి.