English   

సరిలేరు నీకెవ్వరు..అల వైకుంఠపురంలో..ఈ కామన్ పాయింట్స్ గమనించారా

allu arjun mahesh
2020-01-16 17:36:22

ఈ ఏడాది సంక్రాంతి బరిలో అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురంలో, మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు సినిమాలు నిలిచాయి. ఈ రెండు చిత్రాలు భారీ అంచనాల నడుమ సంక్రాంతి కానుకగా ఒకరోజు గ్యాప్ తో రిలీజయ్యాయి. అయితే వీరిద్దరిలో సంక్రాంతి విజేత ఎవరన్న విషయం అయితే ఇంకా తేలలేదు. అయితే ఈ ఇద్దరి సినిమాలకు కొన్ని కామన్ పాయింట్స్ ఉన్నాయి. అవేంటో చూద్దామా

మ్యూజిక్ డైరెక్టర్స్ :

ఈ రెండు సినిమాలకి మ్యూజిక్ ఇచ్చిన ఇద్దరికీ ఆయా హీరోలతో మూడో సినిమా కావడం హైలైట్. భరత్ అనే నేను, మహర్షి తర్వాత దేవిశ్రీ ప్రసాద్ నుండి సరిలేరు నీకెవ్వరు వచ్చిండ్ది. సరైనోడు ,రేసుగుర్రం తర్వాత తమన్ చేసిన మూవీ అలవైకుంఠపురంలో మూవీ కావడం కాకతాళీయమే.

బ్యానర్స్  :

ఈ రెండు సినిమాలు రెండేసి బ్యానర్ లలో తెరకెక్కాయి. సరిలేరు మూవీని ఏకే ఎంటర్టైన్మెంట్స్ అనిల్ సుంకర, వెంకటేశ్వరా క్రియేషన్స్ దిల్ రాజు నిర్మించగా,అలవైకుంఠపురంలో మూవీ ని గీతా ఆర్ట్స్ అల్లు అరవింద్, హారిక హాసిని క్రియేషన్స్ చినబాబులు నిర్మించారు.

డబ్బింగ్ :

ఈ సినిమాల్లో నటించిన హీరోయిన్స్ రష్మిక మందన, పూజా హెగ్డే ఇద్దరూ కూడా కన్నడ భామలే. ఇద్దరూ సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. 

రాజేంద్రప్రసాద్ :

నటుడు రాజేంద్రప్రసాద్ ఈ రెండు సినిమాల్లో నటించాడు.

రీ ఎంట్రీలు :

సుదీర్ఘ విరామం తర్వాత సీనియర్ హీరోయిన్స్ విజయశాంతి,టబు ఈ రెండు సినిమాల ద్వారా రీ ఎంట్రీ ఇచ్చారు.

లక్కీ డేట్స్ :

మహేష్ బన్నీల లక్కీ డేట్స్ రోజున వారి సినిమాలు విడుదలయ్యాయి. సీతమ్మ వాకిట్లో జనవరి 11నే విడుదలయి సూపర్ హిట్ అయింది. ఇప్పుడు అదే డేట్ లో సరిలేరు మూవీ వచ్చింది. అలాగే జనవరి 12న గతంలో దేశముదురు మూవీ వచ్చి సూపర్ హిట్ అయింది. అదే డేట్ లో అలవైకుంఠపురంలో మూవీ వచ్చింది.

డెబ్యూ :

ఈ రెండు సినిమాల హీరోలు మహేష్ బాబు , బన్నీ, వీరిద్దరూ కూడా దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు డైరెక్షన్ లో టాలీవుడ్ కి పరిచయం అయ్యారు. మహేష్ బాబు రాజకుమారుడు మూవీ చేస్తే, బన్నీ గంగోత్రి చేసాడు.

More Related Stories