English   

హీరోయిన్‌ రష్మిక ఇంటిపై ఐటీ దాడులు...అసలు విషయం ఇదట ?

rash
2020-01-16 19:30:01

హీరోయిన్‌ రష్మిక  ఇంటిపై ఐటీ అధికారులు సోదాలు జరిపినట్టు ఈరోజు ఉదయం మీడియాలో వార్తలు వచ్చాయి. అయితే ఈ క్రమంలో ఆ వస్తున్న వార్తలపై రష్మిక మేనేజర్‌ స్పందించారు. రష్మిక ఇంటిపై ఐటీ దాడి జరిగిందనే వార్తలను ఆయన ఖండించారు. అసలు ఆ వార్తలలో వాస్తవం లేదని అన్నారు. రష్మిక తండ్రి మదన్‌ వ్యాపారాలపై ఐటీ సోదాలు జరిగాయని అంతే కానీ రష్మిక ఆదాయానికి సందందించి కాదని ఆయన వెల్లడించారు. రష్మిక ప్రతి అకౌంట్‌, అలాగే ట్రాన్సాక్షన్స్ అన్నీ హైదరాబాద్‌లోనే ఉన్నాయని తెలిపారు. కర్నాటక కూర్గ్‌లోని రష్మిక నివాసంపై ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్టు ఈ ఉదయం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో బిజీగా ఉన్న రష్మిక ఆదాయ లెక్కలలో తేడా రావాడంతోనే ఐటీ అధికారులు సోదాలు చేస్తున్నారని ప్రచారం జరిగింది. అయితే రష్మిక మేనేజర్‌ మాత్రం.. రష్మికకు సంబంధించిన వ్యవహారాలపై ఐటీ అధికారులు ఎలాంటి సోదాలు నిర్వహించలేదని చెప్పారు. మొన్ననే మహేశ్‌ బాబుతో కలిసి సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటించిన రష్మిక చేతిలో మరిన్ని సినిమాలతో బిజీగా ఉన్నారు.

More Related Stories