సరిలేరు నీకెవ్వరూలో రమణ డైలాగ్ చెప్పింది ఎవరో తెలుసా ?

సరిలేరు నీకెవ్వరూ సినిమాలో రమణ లోడ్ ఎత్తాలి రా..చెక్ పోస్ట్ పడుద్ధి అంటూ డైలాగ్ చెప్పి ఒక పవర్ఫుల్ ఫైట్ లో మెరిసిన ఈ పెద్దాయన పేరు 'కుమనన్ సేతురామన్ (Kumanan Sethuraman). స్వతహాగా తమిళుడఅయిన ఆయన ఎలక్ట్రానిక్ ఇంజనీర్ గా పని చేసే వాడు కానీ సినిమా ఇండస్టీ మీద మక్కువతో సినీ ఇండస్ట్రీకి తనకు తెలిసిన ఫోటోగ్రఫీ ద్వారా వెళ్లారు. వెళ్లి మెంబెర్ షిప్ కార్డు తీసుకున్నారు. అలా సినిమాలకి స్టిల్ ఫోటో గ్రాఫర్ గా పని చేసేవారు. అలా ఒక సినిమా షూట్ జరుగుతుండగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనకు ఇచ్చిన డైలగ్ ని సరిగ్గా చెప్ప లేకపోవడంతో 'కుమనన్ నవ్వగా డైరెక్టర్ పిలిచి ఆయన్ను చెప్పామన్నారు. ఆయన ఫట్ మని చెప్పేయడంతో ఆయన్ని ఆ సినిమాలో ఉంచేసారు, అక్కడి నుండి చాలా సినిమాలో ఆయన నటించాడు. బెల్లంబాబు హీరోగా వచ్చిన అల్లుడు శీను సినిమాలో కూడా ప్రదీప్ రావత్ కి గురువుగా నటించాడు. ఆ తర్వాత సైలెంట్ అయిన అయన మళ్ళీ సురేందర్ రెడ్డి సైరా సినిమాలో 'బోయలకు పెద్దగా'గా నటించారు. ఇప్పుడు సరి లేరు నీకెవ్వరూలో కూడా ఆయన పాత్రకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చూశారుగా.