దక్షిణాది మీద కన్నేసిన జాన్వీ కపూర్

అలనాటి అందాల తార శ్రీదేవీ కుమార్తె జాన్వీ కపూర్. 'ధడక్' అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది ఈ భామ. ఆ సినిమా హిట్ అయిన తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో అభిమానులకు కనులవిందు చేస్తోంది. ఈ ముద్దుగుమ్మ తెలుగులో ఎంట్రీ ఇవ్వనుందని ప్రచారం జరుగుతోంది. విజయ్ దేవరకొండ, పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో వస్తోన్న ఫైటర్ సినిమాతో తెలుగుతెరకు పరిచయం కానుందని అంటున్నారు. ఆమె ఇప్పుడు తన తల్లిలాగా దక్షిణాది చిత్రాలలో నటించాలని ఆశపడుడుతున్నదత మంచి కథ, మంచి దర్శకుడితో ఇక్కడకు అడుగుపెట్టాలని భావిస్తున్నట్టు ఆమె స్వయంగా వెల్లడించింది. బాలీవుడ్ సినిమాలు కమర్షియల్ గా ఉంటాయి కానీ, కళాత్మకంగా ఉండవని పరోక్షంగా చెప్పుకొచ్చిన ఈ భామ దక్షిణాదిలో సెటిల్ అయిపోవాలని ప్లాన్ చేస్తుందని ప్రచారం మొదలయింది.