English   

ఏపీలో మారిన రాజకీయం...మోడీషాలతో కలిసిన పవన్ !

pk
2020-01-17 05:08:06

ఏపీ రాజకీయాల్లో కొత్త కూటమి ఆవిర్భవించింది. బీజేపీ-జనసేన పొత్తు ఖరారు అయింది. ఎన్నికలకు ఇంకా నాలుగున్నరేళ్ల కాలం ఉండగానే ఏర్పడిన ఈ పొత్తు రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశంగా మారింది. ప్రజా సమస్యలపై కలిసి పోరాటం చెయ్యడం తో పాటు 2024 లో అధికారం లోకి రావడమే లక్ష్యంగా జనేసేన - బీజేపీ జట్టుకట్టాయి. రెండు పార్టీల తొలి మీటింగ్ లో రాష్ట్ర పరిస్థితులు ప్రభుత్వ పోకడలపై చర్చలు జరిపారు. బీజేపీ అవసరం రాష్ట్రానికి ఉందని పవన్ కళ్యాణ్‌ చెప్పగా పవన్ లాంటి నేతతో పని చెయ్యడం మేలు చేస్తుందని బీజేపీ నేతలు చెపుతున్నారు.

ఇప్పటికిప్పుడు ఎన్నికలు లేకపోయినా ఇకపై రెండు పార్టీలు అన్ని అంశాల్లో కలిసి సాగాలని నిర్ణయం తీసుకున్నాయి. పవన్ డిల్లీ బేటీ తరువాత బీజేపీ పెద్దల సూచనలతో రెండు పార్టీల నేతలు బేటీ అయ్యారు. కలసి సాగాలి అనే నిర్ణయం నేపథ్యంలో వివిధ అంశాలపై చర్చించారు. గత ఐదేళ్లలో రాష్ట్రానికి కేంద్రం ఏం ఇచ్చిందో పవన్ కు బీజేపీ నేతలు వివరించారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపైనా ఇరు పార్టీలనేతలు చర్చించారు. ఇకపై రెండు పార్టీలు ఒకే గళం వినిపిస్తాయని సమావేశం అనంతరం పార్టీ నేతలు వెల్లడించారు. రెండు పార్టీల నేతలతో కో ఆర్డినేషన్ కమిటీ ఏర్పాటు చేసుకుని పని చెయ్యాలని నిర్ణయించారు. ప్రజా సమస్యలపై ఉమ్మడి పోరాటం చేస్తామని పార్టీనేతలు ప్రకటించారు. అటు అధికార వైసిపి, ఇటు ప్రతిపక్ష టిడిపిలకు సమదూరంలో ఉంటామని...కొత్త శక్తిగా ఎదుగుతామని పార్టీ నేతలు ప్రకటించారు. దానికి అనుగుణంగా ఈ నాలుగున్నేరేళ్లు పని చేస్తామని ప్రకటించారు.
 
బీజేపీతో కొన్ని అంశాల్లో కమ్యునికేషన్ గ్యాప్ వచ్చిందని పవన్ కళ్యాణ్ చెప్పారు. రాష్ట్రం కోసం ఇప్పుడు బీజేపీ అవసరం అని పవన్ పేర్కొన్నారు. వామపక్షాలకు తాను బాకీ పడలేదన్న పవన్ మొదటి నుంచి బీజేపీతో ఉన్నానని చెప్పారు. రాజధానిపై వైసీపీ సర్కారు ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటోందని మండిపడ్డారు. అమరావతి విషయంలో జగన్ తీరును బీజేపీ కూడా తప్పుబట్టింది. ప్రత్యేక హోదా విషయంపై స్పష్టత ఇవ్వాలని మాత్రమే తాను గతంలో కోరానని పవన్ చెప్పారు. హోదా రాకపోవడానికి గతంలో టీడీపీ ఇప్పుడు వైసీపీ బాధ్యత వహించాలన్నారాయన. టీడీపీ, వైసీపీ తీరుతో ఏపీ ప్రజలు విసిగిపోయారని భావిస్తున్న జనసేన, బీజేపీ బలమైన ప్రత్యామ్నాయంగా ఎదగాలని వ్యూహాలు సిద్ధం చేస్తున్నాయి.

More Related Stories