English   

మెగా సంబరాలకి కొడుకు వచ్చాడు...పవన్ మిస్

Pawan
2020-01-17 11:04:59

సంక్రాంతి అనేది తెలుగు వాళ్లకి పెద్ద పండుగ, అది సెలబ్రిటీలకి అయినా సామాన్యులకి అయినా ఎంతో ఇష్టమైనపండుగ. ఇక సెలబ్రిటీలలో మెగా కుటుంబం విషయానికి వస్తే వారంతా ఒక్కచోట చేరి ఈ పండుగ జరుపుకొంటుందన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో చిరంజీవి, రామ్‌చరణ్‌, వరుణ్‌తేజ్‌, సాయిధరమ్‌తేజ్‌, కల్యాణ్‌దేవ్‌, నిహారిక, సుష్మితలతో సహా ఇతర కుటుంబసభ్యులు ఈ పండుగ వేడుకల్లో పాల్గొన్నారు. అలా కుటుంబ సభ్యులందరితో కలిసి సందడిగా జరుపుకున్నారు మెగాస్టార్. 

అల్లు అర్జున్, అల్లు శిరీష్‌లతో పాటు పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ తనయుడు అకిరా నందన్ కూడా ఈ సంక్రాంతి సంబరాలలో పార్టిసిపేట్ చేయడం విశేషం. మెగాస్టార్ తీసుకున్నఆ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది కాక తాజాగా చిరంజీవితో పాటు అల్లు ఫ్యామిలీ కూడా కలిసి ఉన్న ఫొటోను రామ్‌ చరణ్ తేజ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. అదే విధంగా చిరంజీవి కుమార్తె శ్రీజ సైతం తన తండ్రి, అన్నయ్యతో కలిసి ఉన్న ఫొటోలను షేర్‌ చేశారు. 

అయితే మెగా కుటుంబ వేడుకల్లో పవన్ కొడుకుని చూసిన ఫ్యాన్స్ 'ఇది కదా అసలైన సంక్రాంతి' అంటూ ఆ ఫోటోను తెగ షేర్ చేసేస్తున్నారు. మరికొందరు అయితే ఒక అడుగు ముందుకు వేసి మరీ వీళ్ళందరూ తమ తమ కుటుంబాలతో హ్యాపీగా గడుపుతుంటే పవన్ రాష్ట్రం కోసం బీజేపీతో పొత్తు పెట్టుకునే సమావేశాలు చేస్తున్నారని కామెంట్స్ చేశారు. అయితే దానికి కూడా కౌంటర్స్ పడుతున్నాయి. తన మూడో భార్యతో కలిసి క్రిస్మస్ సెలబ్రేషన్స్ కి వెళ్ళిన పవన్ అక్కడే అన్నీ కానిచ్చి వచ్చాడని ఇప్పుడు ఇంకేం అవసరం లేదని అంటున్నారు.

More Related Stories