English   

విజయ్ దేవరకొండకు ఇచ్సిన మాట నిలబెట్టుకున్న అల్లు అర్జున్

Allu Arjun
2020-01-17 11:32:00

ఎందుకో గానీ మన చిత్ర సీమలో కొందరి మధ్య విచిత్రమైన స్నేహాలు ఏర్పడుతూ ఉంటాయి. అందులో ఒకటి విజయ్ దేవరకొండ అల్లు అర్జున్ ల స్నేహం. ఎందుకో తెలీదు కానీ విజయ్ దేవరకొండ అంటే స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కు ముందు నుండీ ప్రత్యేకమైన అభిమానం. అతడి సినిమా “గీత గోవిందం” సూపర్ హిట్ అవగానే స్పెషల్ పార్టీ ఇవ్వడమే కాక “ట్యాక్సీవాలా” ప్రీరిలీజ్ ఈవెంట్ కి గెస్ట్ గా కూడా వచ్చాడు. అంటే ఆ రెండు సినిమాలు నిర్మించింది అల్లు అర్జున్ సన్నిహితులే. 

అప్పట్లో ఆ ఈవెంట్ కి చాలా డిఫరెంట్ గా వచ్చిన విజయ్ దేవరకొండను చూసి బన్నీ “నాకు నీ స్టైల్ నచ్చింది” అన్నప్పుడు “అన్న నీకు కూడా కొన్ని పంపిస్తా” అని స్టేజ్ మీద చెప్పుకోచ్చ్హాడు విజయ్. దాదాపు ఏడాది క్రితం అన్న మాటను గుర్తుపెట్టుకొని మొన్న “అల వైకుంఠపురములో” రిలీజ్ సందర్భంగా రౌడీ వేర్ కొన్ని పంపించాడు విజయ్.

ఆ టీషర్ట్స్ ను ట్విట్టర్లో షేర్ చేస్తూ థ్యాంక్స్ చెప్పిన బన్నీ సినిమా ప్రమోషన్స్ లో ఈ టీషర్ట్ వాడతానని చెప్పాడు. అలా ఇచ్చిన అన్నమాట ప్రకారం బట్టలు పంపిన రౌడీ కోసం చెప్పిన మాట కోసం “అల వైకుంఠపురములో” ప్రమోషన్స్ లో రౌడీ వేర్ టీషర్ట్స్ ను వేసుకొంటున్నాడు బన్నీ. అలా ఒక జూనియర్ హీరో అభిమానాన్ని సీనియర్ హీరో నిలబెట్టుకున్నాడన్న మాట.

More Related Stories