English   

పవర్ స్టార్ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్

Pawan Kalyan
2020-01-17 16:44:50

'అజ్ఙాతవాసి' సినిమా తర్వాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పూర్తిగా రాజాకీయాలకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ విషయంలో మెగాభిమానులు చాలా నిరాశ పడ్డారు. అయితే ఇప్పుడు.. పవన్ రీ ఎంట్రీ  దాదాపుగా ఖరారు కావడంతో.. ఆ సినిమా కోసం ఇప్పటి నుంచే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. బోనీకపూర్ తో కలిసి దిల్ రాజు నిర్మాణంలో.. వేణు శ్రీరామ్‌ దర్శకత్వంలో బాలీవుడ్ హిట్ మూవీ 'పింక్‌' ను తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. ఇప్పటివరకు ఈ సినిమాపై పవన్ స్పందించకపోయినప్పటికీ.. దిల్ రాజు ఓపెన్ అవడం, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కన్ఫార్మ్ చేయడంతో.. ఇండస్ట్రీలో రోజుకో ఆసక్తికరమైన వార్త వినిపిస్తోంది.
    
వివరాల్లోకి వెళితే.. ఈ నెల 20 నుంచి పింక్ రీమేక్ రెగ్యూలర్ షూటింగ్ స్టార్ట్ అవనుంది. ఫిబ్రవరిలో పవన్ షూటింగ్ లో పాల్గొనబోతున్నాడట. ఈ సినిమా కోసం పవన్ 20 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే.. ఇంకా సెట్స్‌ మీదకు రాని ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ విషయంలోనూ ఓ క్లారిటీ వచ్చిన్టటు జోరుగా చర్చ జరుగుతోంది. ఈ ఏడాది వేసవి కానుకగా మే 23న ఈ క్రేజీ మూవీని రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు సమచారం.
    
ఇకపోతే.. ఈ మూవీలో నివేదా థామస్, అంజలి, అనన్య.. ఈ ముగ్గురు కీ రోల్స్ పోషించబోతున్నారు. హీరోయిన్ గా పలువురు పేర్లు వినిపించినా.. తాజాగా పూజా హెగ్డేను ఫైనల్ చేసే ఆలోచనలో ఉన్నట్టు టాక్. అలాగే.. ఈ చిత్రం ఎక్కువ భాగం షూటింగ్ కోర్టులోనే ఉంటుంది. దాంతో అన్నపూర్ణ స్టూడియోలో భారీ కోర్టు సెట్ వేస్తున్నారు. అంతేకాదు.. ఇందులో పవన్ ఎంట్రీ కోసం పవర్ ఫుల్ యాక్షన్ ఎపిసోడ్ ను డిజైన్ చేశారట. మరి ఈ ప్రాజెక్ట్ గురించి ఎప్పుడు అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఉంటుందో చూడాలి. 

More Related Stories