English   

తమిళనాట పొంగల్ ను పంచేసుకున్న మామ అల్లుళ్లు..

Rajinikanth Dhanush
2020-01-18 11:17:43

సౌత్ ఇండియాలోనే మోస్ట్ ఫేమస్ మామా అల్లుళ్లు రజనీకాంత్, ధనుష్. ఇద్దరు ఈసారి పొంగల్ కు ఒకేసారి తమ సినిమాలను తీసుకొచ్చారు. అందులో రజినీకాంత్ సినిమా వారం రోజుల ముందుగా విడుదలైంది. జనవరి 9న రిలీజ్ కావడంతో తొలివారంలోనే దాదాపు 75 కోట్ల షేర్ వసూలు చేశాడు రజినీకాంత్. 

మరో వైపు జనవరి 15న ధనుష్ నటించిన పటాస్ సినిమా రిలీజ్ అయింది. దురై సెంథిల్ కుమార్ తెరకెక్కించిన ఈ సినిమా పక్క విలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చింది. ఇందులో ధనుష్ ద్విపాత్రాభినయం చేశాడు. రొటీన్ స్టోరీ అని నెగిటివ్ టాక్ తెచ్చుకున్న కూడా కలెక్షన్ల పరంగా మాత్రం ధనుష్ దుమ్ము దులిపేస్తున్నాడు. పండగ సీజన్ కావడంతో మాస్ సినిమాకు ప్రేక్షకులు క్యూ కడుతున్నారు. దానికి తోడు అసురన్ లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత ధనుష్ నటించిన సినిమా కావడంతో కలెక్షన్లు భారీగానే వస్తున్నాయి. పటాస్ రావడంతో దర్బార్ సినిమాకు కలెక్షన్లు తగ్గిపోయాయి. 

తమిళనాట ఈసారి కూడా రజినీకాంత్ కు నిరాశ తప్పేలా కనిపించడం లేదు. ఎందుకంటే ఊహించిన దానికంటే దర్బార్ సినిమాకు కలెక్షన్లు చాలా తక్కువగా వచ్చాయి. కేవలం తమిళనాడులోనే ఈ సినిమాను 65 కోట్లకు అమ్మారు. ఇప్పటివరకు 40 కోట్ల మార్కు కూడా అందుకోలేదు. మరోవైపు తెలుగులో కూడా ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. చూసుకున్నా కూడా రజినీకాంత్, మురుగుదాస్ కాంబినేషన్ పెద్దగా వర్కవుట్ కాలేదు సినిమాకు టాక్ బాగానే వచ్చినా కూడా కలెక్షన్ల విషయంలో మాత్రం చాలా వెనకబడి పోయింది. దర్బార్ వేరే సినిమాలు లేకపోయినా కూడా ఈ సినిమా కలెక్షన్లు తక్కువగా వచ్చాయి అంటే నిజంగానే రజినీకాంత్ మేనియా అయిపోయిందేమో అనే అనుమానాలు వస్తున్నాయి. 

ఒకప్పుడు ఈయన సినిమాలు ఎలా ఉన్నా కూడా కలెక్షన్లు మాత్రం అదిరిపోయేవి. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. టాక్ బాగా వచ్చినా కూడా కలెక్షన్లు మాత్రం రావడం లేదు. మరోవైపు పటాస్ సినిమాతో ధనుష్ కూడా ఓపెనింగ్స్ వరకు బాగానే తీసుకొస్తున్నాడు. 2020లో వేరే సినిమాలు రాకపోవడంతో ఈ పొంగల్ మామ అల్లుళ్ళ సొంతమయిపోయింది. కానీ పండుగ చేసుకోవడం మాత్రం వీళ్లు వెనుకబడి పోయారు. ఇలాంటి టైమ్ లో ఇంకొక్క మంచి సినిమా వచ్చుటే కచ్చితంగా పొంగల్ మరింత కలర్ ఫుల్ గా మారిపోయేది. తెలుగులో మహేష్ బాబు, అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరోల వచ్చి మన పండగను రంగులమయంగా మార్చేశారు. కానీ తమిళనాట రజనీకాంత్, ధనుష్ అలా చేయడంలో విఫలం అయ్యారు.  

More Related Stories