English   

రష్మికను ఇమిటేట్ చేసిన స్టార్ డాటర్స్.. 

Aadya Sitara
2020-01-18 15:47:26

మరోసారి సంక్రాంతి బరిలో తనకు తానే సాటి అని నిరూపించుకున్నాడు సూపర్‌స్టార్ మహేష్ బాబు. అనిల్ రావిపూడి డైరెక్షన్లో, విజయశాంతి కీ రోల్ లో, రష్మకి మందన్నా హీరోయిన్ గా.. అనిల్ సుంకర, దిల్ రాజు, మహేష్ బాబు కలిసి నిర్మించిన 'సరిలేరు నీకెవ్వరు' సంక్రాంతి కానుకగా జనవరి 11న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా మొదటి వారంలో  రూ.100 కోట్ల వసూళ్లను రాబట్టింది.

ఇదిలా ఉంటే మహేష్ కూతురు సితార, దర్శకుడు వంశీ పైడిపల్లి కూతురు ఆద్య కలిసి A&S అనే యూట్యూబ్ ఛానెల్ రన్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఛానల్ ద్వారా వీళ్లు చేసే హంగామా మామూలుగా ఉండడం లేదు. అందులోభాగంగా ఇప్పటికే రష్మికను ఇంటర్య్వూ చేయగా.. 'సరిలేరు నీకెవ్వరు సక్సెస్ మీట్ విత్ ఎమ్‌బి' పేరుతో మహేష్ బాబుని ఇంటర్వూ చేశారు. అంతేకాదు  వాళ్ల స్వీట్ స్వీట్ మాటలతో క్యూట్ నెస్ తో అందరిని కట్టిపడేస్తున్నారు. 

అయితే ఈ మూవీలో రష్మిక మందన్నా తనదైన శైలిలో డైలాగ్స్ , కామెడీతో చాలా బాగా ఆకట్టుకుంది. నీకు అర్థమవుతుందా.. అంటూ అమాయకంగా అందరినీ కట్టిపడేసింది. తాజాగా ఈ డైలాగ్ కి సంబంధించి సితార, ఆద్య కలిసి చేసిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 'దేవుడా.. ఒక క్యూట్, స్వీట్, హ్యాండ్సమ్ కుర్రోణ్ణి చూపించవయ్యా.. నీకర్థమవుతుందా' అంటూ రష్మికను చాలా స్వీట్ గా తమ క్యూట్ ఎక్స్ ప్రెషన్స్ తో ఇమిటేట్ చేశారు సితార, ఆద్య. ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది. ఏదేమైనా స్టార్ హీరో, స్టార్ డైరెక్టర్ కూతుళ్లుగా భళా అనిపించుకుంటున్నారు.

More Related Stories