English   

ఒక్కో హీరోను ఒక్కో ఛానెల్ భలే సెట్ చేసుకుంది 

Tollywood
2020-01-18 16:33:22

ఈ మధ్య కాలంలో ఒక టాక్ బాగా వినిపిస్తోంది. అదేంటంటే భవిషత్తులో సినిమాలు మాయం అవ్వచ్చు ? వాటిని వెబ్ సిరీస్ రీప్లేస్ చేయనున్నాయి అనే వాదన వినిపిస్తోంది. ఈ వాదనకు తగ్గట్టే చాలా మంది స్టార్స్ ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాటిలో భాగం అవుతున్నారు. అయితే పెద్ద పెద్ద పండగలకు కొత్త సినిమాలు వేసుకుని వాటి ద్వారా టీఆర్పీలు పెంచుకునేవి టీవీ ఛానల్స్.  ఇప్పుడు ఏకంగా ఆ హీరోలను తమ కార్యక్రమలో భాగం చేస్తున్నాయి. హీరోలు కూడాతమ సినిమా ప్రమోషన్ కి ఉపయోగ పడుతుంది కదా అని వచ్చేసినట్టున్నారు. 

తాజాగా ఈ సంక్రాంతికి వివిధ ఛానెల్స్ టెలికాస్ట్ చేస్తున్న షోలకు, స్పెషల్ ఈవెంట్లకు అక్కడితో ఆగక తమ సీరియల్స్ కు ఇలా మన టాలీవుడ్ హీరోలను భలే సెట్ చేసేసుకున్నారు. అసలు ముందుగ ఈటీవీ ఛానెల్ వారు నాగశౌర్య ను తమ ఈవెంట్ కు స్పెషల్ గెస్ట్ గా తీసుకురాగా మేమేం తక్కవ తిన్నామా అని అదే నాగశౌర్యతో జీ తెలుగు రెండు రోజులు ఒక స్పెషల్ ప్రోగ్రాం టెలీకాస్ట్ చేసింది. 

ఇది ఒక ఎత్తు అయితే నందమూరి కళ్యాణ్ రామ్ తో స్టార్ మాలో వదినమ్మ సీరియల్ లో ఏకంగా ఒక నటింపచేసేసారు. ఇవి చూసి కేకంగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుతో అయితే జీతెలుగు వారు అసలు ఏ ఛానెల్ చెయ్యని విధంగా తమ సీరియల్స్ కు ప్రమోషన్స్ కూడా ఇప్పించేశారు. అలా ఈ సంక్రాంతిని బుల్లితెర మీద బడా హీరోలను చూపించేసారు.

More Related Stories