English   

జక్కన్న మారిపోయాడు...పిలిచినా కుదరందంటూ 

Rajamouli
2020-01-18 17:01:59

తెలుగు సినిమా గురించి చెప్పాలంటే బాహుబలి ముందు బాహుబలి తర్వాత అనేలా మారిపోయింది పరిస్థితి. దానికి కారణం ఎవరో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అయితే ఈయనకి ఒక అలావాటు ఉంది, అదేంటంటే తన సినిమా తన స్వార్ధం అనుకోకుండా మిగతా వాళ్ళ సినిమాలు కూడా చూసి వారిని అభినందించేవాడు. అలా అభినందిస్తే కొందరు తటస్థులు కూడా వెళ్లి సినిమా చూసి వచ్చే వారు. కానీ కొంత కాలంగా ఆయన తన స్టైల్ మార్చాడు. 

అసలు బిజీగా ఉన్నాడో లేక మరెందుకో కానీ ఆయన వేరే వాళ్ళ సినిమాల గురిన్కిహ్ చెప్పడం మానేశాడు. అప్పుడెప్పుడో సాహో సినిమా గురించి పొగిడిన ఆయన మొన్న కీరవాణి కొడుకు సినిమా వచ్చే దాకా ట్వీట్ జారలేదు. ఇక తాజాగా ఇద్దరు స్టార్ హీరోల సినిమాలు సంక్రాంతి బరిలో దిగాయని తెలిసి, రెండు సినిమలాకి సూపర్ హిట్ టాక్ వచ్చిందని తెలిసినా ఆయన ఏమీ మాట్లాడక పోవడం, ఎటువంటి ట్వీట్ చేయకపోవడం ఆశ్చర్యకరంగా మారింది. 

అయితే ఆయన ఈ సినిమాల గురించి త్వీట్ చేయక పొవాడానికి గల కారణం వేరే ఉందని అంటున్నారు. అదేంటంటే ఆయన వేరే సినిమాలు చేసే మూడ్ లో లేదట. ఎందుకంటే ఆయన ప్రస్తుతం ఆర్‌ఆర్‌ఆర్‌ పనులతో బిజీగా ఉన్నాడట. అందుకే ఆయన వేరే వాళ్ల సినిమా వేడుకలకి పిలిచినా రావడం కుదరదని చెప్పేస్తున్నాడట. అయినా తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే, ముందు మన సినిమా తర్వాతే పక్కన వాళ్ళ సినిమా అని ఫిక్స్ అయ్యారేమో రాజమౌళి సారు.

More Related Stories