సరిలేరు నీకెవ్వరు ఫస్ట్ వీక్ కలెక్షన్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం సరిలేరు నీకెవ్వరు. చాలా కాలం తరువాత మహేష్ మాస్ రోల్లో కనిపించటంతో అభిమానులు అయితే పండగ చేసుకుంటున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 11న అంటే సరిగ్గా వారం క్రితం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా హౌస్‌ఫుల్ కలెక్షన్లతో దూసుకుపోతోంది. మొత్తంగా 7 రోజుల్లో ఈ సినిమా రూ. 100 కోట్ల షేర్‌ను వసూళు చేసినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సందర్భంగా నిన్న ఉదయం తిరుమల శ్రీవారి దర్శించుకున్న చిత్ర యూనిట్ నిన్న రాత్రి వరంగల్‌లో బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ నిర్వహించారు.
ఇక సినిమా మొదటి రోజు తెలంగాణ, ఏపీలో కలిపి రూ.32.77 కోట్ల షేర్ వసూలు చేసిన ఈ సినిమా. ఓవర్సీస్, రెస్టాఫ్ ఇండియా కలిపి ప్రపంచ వ్యాప్తంగా ఫస్ట్ డే రూ. 46.7 కోట్ల షేర్ వసూలు చేసింది. మొత్తంగా ఈ సినిమా మూడు రోజుల్లోనే వరల్డ్ వైడ్‌గా 100 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఇక నిన్న ఏడో రోజు కూడా బాక్సాఫీస్ దగ్గర అదే దూకుడు కంటిన్యూ చేసింది సరిలేరు నీకెవ్వరు.
మొత్తంగా ఈ సినిమా ఏడూ రోజులకు గాను తెలుగు రాష్ట్రాల్లో రూ. 85.56 కోట్ల షేర్, కర్ణాటకలో రూ.6.4 కోట్లు, రెస్టాఫ్ ఇండియాలో రూ. 2.7 కోట్లు, ఓవర్సీస్ లో 12 కోట్లకు పైగా కలెక్ట్ చేసింది. అలా మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా రూ. 105.6 కోట్లతో విడుదలైన అన్ని చోట్లా బ్రేక్ ఈవెన్ కి చేరుకుని సినిమాను కొన్న డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ జోన్లో పడేసింది. ఇక ఈ రోజు శనివారం, రేపు ఆదివారం కావడంతో ఈ సినిమా కలెక్షన్లు మరింత పెరిగే అవకాశం ఉంది.