English   

అల్లు అర్జున్ సుకుమార్ మూవీ టైటిల్ 

 Allu Arjun
2020-01-18 18:51:03

ప్రస్తుతం అల్లు అర్జున్ అల వైకుంఠపురంలో సినిమా సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా తర్వాత బన్నీ తన నెక్ట్స్ ప్రాజెక్ట్.. స్టార్ డైరెక్టర్ సుకుమార్ తో చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టడానికి సిద్దమవుతోంది ఈ క్రేజీ కాంబినేషన్. అయితే మొన్నటి వరకు బన్నీ అల వైకుంఠపురంతో బిజీగా ఉండడం వల్ల.. స్టైలిష్ స్టార్ లేని కొన్ని సీన్లను తొలి షెడ్యూల్ లో భాగంగా కేరళలో ప్లాన్ చేసుకున్నారు. 

ఇప్పుడు బన్నీ ఫ్రీ అవడంతో ఫిబ్రవరి ఫస్ట్ వీక్ నుంచి నెక్ట్స్ షెడ్యూల్ ప్లాన్ చేశారు. అల్లు అర్జున్ కెరీర్‌లో 20వ సినిమా కావడం, రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ తర్వాత సుకుమార్ చేయబోతున్న ప్రాజెక్ట్ కావడంతో ఇప్పటి నుంచే ఈ సినిమాపై భారి అంచనాలు ఏర్పడ్డాయి. ఇందులో హీరోయిన్ గా రష్మిక మందన్న నటిస్తోంది. అలాగే ప్రముఖ తమిళ హీరో విజయ్ సేతుపతి కీ రోల్ పోషించబోతున్నాడు. తాజాగా అనసూయ కూడా ఇందులో ముఖ్య పాత్రలో నటించనున్నట్టు టాక్.

ఇకపోతే.. ఎర్రచందనం స్మగ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా ఉండబోతుందని సమాచారం. దాంతో అలాంటి టైటిలే ఖరారు అయినట్టు వినిపిస్తోంది. చిత్తూరు జిల్లా శేషాచలం అడవుల్లో జరిగే కథ కాబట్టి.. దానికి సరిపోయే టైటిల్ ఫిక్స్ చేశారని సమాచారం. అందులోభాగంగా 'శేషాచలం' అనే టైటిల్‌ అనుకుంటున్నట్టు తెలుస్తోంది. అల్లు అర్జున్‌ కూడా 'శేషాచలం' టైటిల్కు ఓకే అన్నాడని వినిపిస్తోంది. అయితే ఇదే టైటిల్ ను ఫిక్స్ చేస్తారా.. లేదా అనేది క్లారిటీ రావాల్సి ఉంది.

More Related Stories