English   

మకాం మార్చనున్న చైతు-సమంత..?

sam
2020-01-18 20:35:43

తెలుగులో 'ఏమాయ చేశావే' సినిమాతో సమంతగా పరిచయమై.. ఆ తర్వాత నాగచైతన్యను పెళ్లి చేసుకొని సమంత అక్కినేనిగా మారిపోయింది సమంత. ఈ చిత్రంలో కలిసి నటించినప్పటి నుంచే నాగచైతన్య, సమంతలు ప్రేమలో పడిపోయారు. ప్రస్తుతం చైతూ-స్యామ్ ల జంట మేడ్ ఫర్ ఈచ్ అదర్ అనిపించుకుంటున్నారు. మ్యారేజ్ అయిన తర్వాత కూడా సమంత తెలుగులో టాప్ హీరోయిన్‌గా కొనసాగుతుండడం విశేషం.

ఇదిలా ఉంటే.. స‌మంత ఎలాంటి సెల‌బ్రేషన్స్ జరుపుకోవాలనుకున్నాగోవా వేదిక‌గా మారుతోంది. ఇప్పటికే పెళ్లి మొదలుకొని, ఫస్ట్ పెళ్లి రోజు, న్యూ ఇయర్ సెలబ్రేషన్స్, బర్త్ డే సెలబ్రేషన్స్ ఇలా ఎలాంటి అకేషన్ అయినా గోవాలోనే జరుపుకోవడం విశేషం. రీసెంట్ గా కూడా నాగ చైతన్య, సమంత గోవాలో వాలిపోయారు. అయితే ఎందుకెళ్లారనేది మాత్రం సీక్రెట్ గా ఉంచారు. దాంతో మ్యాటర్ ఏంటని ఆరా తీయగా.. అసలు విషయం తెలిసింది. వివరాల్లోకి వెళితే..

గోవా అంటే సమంతకు చాలా ఇష్టమట. అందుకే అక్కడే బీచ్ దగ్గర సొంతిల్లు కట్టుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. అందుకోసం కొంత స్థలాన్ని కూడా కొనుగోలు చేసినట్టు సమాచారం. సముద్ర తీరంలో ఇద్దరు సేద తీరడానికి అన్నీ సౌకర్యాలతో కూడిన ఒక విలాసవంతమైన విల్లాను నిర్మించనున్నారట. ఇదే విషయమై చైతు-సామ్ లు గోవాకి వెళ్లినట్టు సమాచారం. అయితే.. సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నాకే గోవాకు వెళ్లే ఆలోచనలో ఉన్నారట. ఇప్పటికే షారుఖ్ ఖాన్, ఐశ్వర్యరాయ్ వంటి పలువురు బాలీవుడ్ స్టార్స్ కూడా గోవాలో తిష్ట వేసిన సంగతి తెలిసిందే.

 

More Related Stories