English   

యంగ్ టైగర్.. మెగా హీరోలకు చాలా స్పెషలా..?

ntr
2020-01-18 20:44:24

బాహుబలి తర్వాత జక్కన రాజమౌళి తెరకెక్కిస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్ కొమురం భీమ్, రామ్ చరణ్ అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ సరసన ఒలివియా మోరిస్, చరణ్ సరసన ఆలియాభట్ నటిస్తోంది. ముందుగా వీళ్ల కాంబినేషన్లో సినిమా అనగానే.. అటు మెగాభిమానులు, నందమూరి అభిమానులు ఫుల్ ఖుషీ అయిపోయారు. అయితే.. రీసెంట్ గా చెర్రీ తన కో స్టార్ అయిన ఎన్టీఆర్ గురించి.. ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్య్వూలో పలు ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చాడు.

ఎన్టీఆర్ ఎనర్జీని మెచ్చుకోవడమే కాదు.. అతనొక టపాకాయలాంటి వాడని చెప్పాడు. ఎన్టీఆర్ సెట్ లో ఉంటే చాలా సందడిగా ఉంటుందని.. తను చుట్టుపక్కల లేకపోతే మిస్సవుతున్న ఫీలింగ్ కలుగుతుందని చెప్పాడు. అలాగే ఈ సినిమాకు ముందే తామిద్దరం మంచి మిత్రులమని.. ఆ బాండింగ్ ఆర్ఆర్ఆర్ లో నటించడానికి చాలా దోహదపడిందని.. మా ఇద్దరి జర్నీ చాలా గొప్పగా ఉంటుందని చెప్పాడు. దాంతో మెగా హీరోలకు ఎన్టీఆర్ అంటే చాలా స్పెషల్ అనే టాక్ మొదలైంది. ఎందుకంటే గతంలో మెగాహీరోలు కూడా ఎన్టీఆర్ ని పొగడడం ప్రత్యేకతను సంతరించుకుంది.

సంక్రాంతికి వచ్చిన అల్లు అర్జున్ 'అల వైకుంఠపురంలో' సినిమాను పొగుడుతూ ఎన్టీఆర్ ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. దాంతో బన్నీ కూడా చాలా హ్యాపీగా ఫీలవుతున్నట్టు రిప్లే ఇచ్చాడు. అలాగే సాయి ధరమ్ తేజ్, ఎన్టీఆరే బెస్ట్ డాన్సర్ అనడం విశేషం. అంతేకాదు ఒకానొక సందర్భంలో మెగా డాటర్ నిహారిక కూడా ఎన్టీఆర్ తో కలిసి నటించాలని ఉందని చెప్పుకొచ్చింది. తాజాగా రామ్ చరణ్ కూడా ఆర్ఆర్ఆర్ విషయంలో ఎన్టీఆర్ పై ప్రశంసలు కురిపించాడు. ఇలా యంగ్ టైగర్ మెగా హీరోలతో మంచి స్నేహం కలిగి ఉండడం విశేషమనే చెప్పాలి. ఏదేమైనా ఇలాంటి వాతావరణం స్టార్ హీరోల ఫ్యాన్స్ మధ్య కూడా మంచి స్నేహభావం కల్గిస్తుందని చెప్పొచ్చు.

More Related Stories