English   

ఆర్ఆర్ఆర్ రిలీజ్ డేట్ మారిందా..?

rrr
2020-01-19 07:36:51

సినిమా అనౌన్స్ చేసినప్పుడే రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసి.. అనుకున్న టైంకి సినిమాను రిలీజ్ చేయడం దర్శకధీరుడు రాజమౌళి ప్రత్యేకత. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఆర్ఆర్ఆర్ మూవీని ముందుగానే.. జూలై 30న రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించాడు. దాంతో అభిమానులు ఆ రోజు కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. అయితే ప్రస్తుత సమాచారం ప్రకారం.. జూలై 30న ఈ సినిమా విడుదల కష్టమే అంటున్నారు. ఒకవేళ అదే జరిగితే మరో తేదీని కూడా ఫిక్స్ చేసినట్టు టాక్.

ఇప్పటికే 70శాతం పైగా చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఆర్ఆర్ఆర్.. సంక్రాంతి సందర్భంగా షూటింగ్ కి కాస్తా బ్రేక్ ఇచ్చారు. దాంతో సినిమా రిలీజ్ డేట్ మారనుందని వినిపిస్తోంది. తిరిగి ఈ నెల 20 నుంచి రెగ్యూలర్ షూటింగ్ జరుపుకోనుంది. మార్చి ఎండింగ్ లో షూట్ పూర్తి చేసుకోవాల్సి ఉండగా.. దానికి సమయం సరిపోదని భావిస్తున్నారట. ఇక పోస్ట్ ప్రొడక్షన్ కి ఇంకాస్త ఎక్కువ సమయం పడుతుందని.. ఈ నేపథ్యంలో సినిమాను దసరా కానుకగా అక్టోబర్ లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.

అయితే.. గతంలో ఇలాంటి కథనాలు సోషల్ మీడియాలో చాలా వినిపించాయి. కానీ ఈ సారి దసరా అనడంతో.. ఖచ్చితంగా వాయిదా పడ్డట్టే అంటున్నారు. దాంతో నిజంగా ఆర్ఆర్ఆర్ రిలీజ్ వాయిదా పడుతుందా..? అని సందేహంలో పడిపోయారు నందమూరి ఫ్యాన్స్, మెగాభిమానులు. అయితే ఈ విషయం పై చిత్రయూనిట్ స్పందిస్తేగానీ అసలు విషయం తెలియదు. ఏదేమైనా.. ఆర్ఆర్ఆర్ విడుదల వాయిదా జక్కన్న అభిమానుల్ని నిరాశ పరిచిందనే అనుకోవాలి.

More Related Stories